వినోదాన్ని బతికించండి: బ్రహ్మానందం

Published on Tue, 09/23/2025 - 00:30

‘‘తమ జీవితం ఎలా ఉన్నా అందర్నీ నవ్వించాలనే సిద్ధాంతంతో బతుకుతున్నారు హాస్యనటులు. అందుకే కమెడియన్స్ ని ఆశీర్వదించండి.. వినోదాన్ని బతికించండి. కామెడీ బతికితే అందరూ ఆనందంగా ఉంటారు’’ అని హాస్యనటుడు బ్రహ్మానందం తెలిపారు. ప్రియదర్శి, నిహారిక ఎన్‌.ఎం జోడీగా విజయేందర్‌ ఎస్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘మిత్ర మండలి’.

బీవీ వర్క్స్‌ సమర్పణలో కల్యాణ్‌ మంతిన, భాను ప్రతాప, డా.విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా అక్టోబరు 16న విడుదల కానుంది. ఆర్‌ఆర్‌ ధృవన్‌ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘జంబర్‌ గింబర్‌ లాలా..’ అంటూ సాగే మూడోపాటని బ్రహ్మానందం చేతులమీదుగా లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ–‘‘నేను ఈ సినిమాలో ఎలాగైనా ఉండాలని నన్ను తీసుకొచ్చాడు బన్నీ వాసు.

కడుపుబ్బా నవ్వించే హాస్య చిత్రం ‘మిత్ర మండలి’’ అని చెప్పారు. ‘‘మా సినిమా చూసి బాగా నవ్వుతారని హామీ ఇస్తున్నాను’’ అన్నారు ప్రియదర్శి. ‘‘బ్రహ్మానందంగారితో మొదటిసారి వేదికని పంచుకోవడం జీవితంలో మర్చి పోలేని క్షణం’’  అన్నారు చిత్ర సమర్పకులు బన్నీ వాసు. ‘‘నా మొదటి సినిమాలో బ్రహ్మానందంగారు ఉండటం గౌరవంగా భావిస్తున్నాను’’ అని విజయేందర్‌ ఎస్‌ తెలిపారు. విజయేందర్‌ రెడ్డి తీగల, నిహారిక ఎన్‌.ఎం, సంగీత దర్శకుడు ఆర్‌ఆర్‌ ధృవన్, నటులు రాగ్‌ మయూర్, విష్ణు, ప్రసాద్‌ బెహ్రా మాట్లాడారు.

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)