Breaking News

వారికి ఇష్టమైన ఫోటోలతో శ్రీదేవిని గుర్తు చేసుకున్న జాన్వీ,బోనీ కపూర్‌

Published on Sun, 08/13/2023 - 17:18

అతిలోక సుందరి శ్రీదేవి 60వ జయంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఆమెను స్మరించుకుంటున్నారు. శ్రీదేవికి నివాళులు అర్పిస్తున్నారు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తన అమ్మగారిని గుర్తు చేసుకుంది. బోనీ కపూర్ తన భార్యతో కలిసి తీసుకున్న పాత ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అక్కడ 'హ్యాపీ బర్త్‌డే' అని తెలుపుతూ హార్ట్‌ ఎమోజీలతో క్యాప్షన్ ఇచ్చారు. శ్రీదేవి చిన్న కుమార్తె  ఖుషీ కపూర్ కూడా పలు పాత ఫోటోలను షేర్‌ చేసి శ్రీదేవిని గుర్తు చేసు​కుంది. పలు లవ్‌ ఎమోజీలతో పాటు 'హ్యాపీ బర్త్‌డే మామా' అని రాసింది. 

(ఇదీ చదవండి: భార్య వల్లే ఆ హీరో కెరీర్‌ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో)

తాజాగ విడుదలైన 'బవాల్' చిత్రంలో కనిపించిన జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్ కథనాలలో తన తండ్రి సందేశాన్ని మళ్లీ పోస్ట్ చేసింది. కొద్దిసేపటి క్రితమే తన కొత్త సినిమా ప్రమోషన్ సందర్భంగా జాన్వీ కపూర్‌ శ్రీదేవి గురించి మాట్లాడింది. తన తల్లి మరణం తనకు చాలా కఠినమైన సమస్య అని, శ్రీదేవిని రోల్ మోడల్‌గా చూస్తున్నానని చెప్పింది. ఆమె మరణం తర్వాత తన కెరీర్‌ను కూడా శ్రీదేవిలా ఉండాలని కోరుకుంటున్నానని జాన్వీ తెలిపింది.

40 ఏళ్లపాటు శ్రీదేవి ట్రెండ్‌ 
1963 ఆగస్టు 13న  తమిళనాడులో శ్రీదేవి జన్మించారు.  శ్రీ అమ్మ యాంగర్ అయ్యప్పన్ అనేది  శ్రీదేవి అసలు పేరు. సినిమాల కోసం శ్రీదేవిగా పేరు మార్చుకుని 40 ఏళ్లపాటు ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. తెలుగు, తమిళం,మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో సుమారు  250 సినిమాల్లో నటించారు. తెలుగులో 'పదహారేళ్ల వయసు' సినిమాతో హీరోయిన్​గా ఎంట్రీ చేసిన శ్రీదేవి.. అతిలోక సుందరిగా తన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. 1996లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌ని వివాహం చేసుకున్నారు. వారికి జాన్వీ కపూర్‌, ఖుషీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  54 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 24, 2018న శ్రీదేవి మరణించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)