Breaking News

కథ విన్నారా?

Published on Tue, 04/08/2025 - 00:15

బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్, దర్శకుడు బాబీ (కేఎస్‌ రవీంద్ర) కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందించడానికి  సన్నాహాలు మొదలయ్యాయనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇటీవల హృతిక్‌ రోషన్ ను కలిసి ఓ కథ వినిపించారట బాబీ. ఈ స్టోరీ లైన్‌కు ప్రాథమికంగా అంగీకారం తెలిపారట హృతిక్‌. 

దీంతో ప్రస్తుతం స్క్రిప్ట్‌కు మరింత మెరుగులుదిద్దే పనిలో దర్శకుడు బాబీ బిజీగా ఉన్నారని సమాచారం. మరోసారి హృతిక్‌ రోషన్ ను కలిసి, బాబీ ఫైనల్‌ స్క్రిప్ట్‌ నరేషన్  ఇవ్వనున్నారట. అప్పుడు ఈ స్టోరీకి హృతిక్‌ రోషన్  ఫైనల్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇస్తే, ఈ కాంబినేషన్  సెట్‌ అయినట్లేనని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

ఇక ఈ మూవీని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్  ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించనున్నారని భోగట్టా. మరి.. హృతిక్‌ రోషన్  కథ విన్నారా? హృతిక్‌–బాబీల కాంబినేషన్  సెట్‌ అవుతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. ఇదిలా ఉంటే హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్‌ కలిసి నటించిన స్పై యాక్షన్  డ్రామా ‘వార్‌ 2’ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. అయాన్  ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మించారు.

Videos

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)