Breaking News

బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తున్న ‘స్త్రీ 2’.. ఇంతకీ ఈ మూవీలో ఏముంది?

Published on Sun, 08/18/2024 - 10:53

కంటెంట్‌ బాగుంటే చాలు నటీనటులు, భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు నేటి ప్రేక్షకులు. ఏ భాషలోనే తెరకెక్కించినా చాలు.. హిట్‌ టాక్‌ వస్తే థియేటర్స్‌కి వెళ్లి చూస్తున్నారు. అలా ఇప్పుడు బాలీవుడ్‌ మూవీ స్త్రీ 2కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 15న విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది.  రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.135 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది.

(చదవండి: బ్రదర్‌ అంటే బెస్ట్‌ ఫ్రెండ్‌: సితార ఘట్టమనేని)

వాస్తవానికి ఈ సినిమాకి ప్రిమియర్‌ షో నుంచే హిట్‌ టాక్‌ వచ్చింది. తొలి రోజు ఏకంగా రూ. 51 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలకు కూడా ఈ స్థాయి కలెక్షన్స్‌ రాలేదు. వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు రావడం కూడా సినిమాకు ప్లస్‌ అయింది. దీనికి తోడు ఆగస్ట్‌ 15న విడుదలైన చిత్రాలన్నీ ప్లాప్‌ టాక్‌ మూటగట్టుకోవడం కూడా స్త్రీ 2కు కలిసొచ్చింది.  

స్త్రీ 2 కథేంటంటే..
2018 లో రిలీజై భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన హారర్‌ థ్రిల్లర్‌ స్త్రీ  చిత్రానికి సీక్వెల్‌ ఇది. పార్ట్‌ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్‌ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్‌ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్‌ కుమార్‌ రావు, పంకజ్‌ త్రిపాఠి, అభిషేక్‌ బెనర్జీ, అపర్‌ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్‌) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్‌ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్‌ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ.

(చదవండి: మమ్ముట్టి ‘టర్బో’ మూవీ రివ్యూ)

దర్శకుడు అమర్ కౌశిక్ వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్‌ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ఒకవైపు భయపెడుతూనే మరోవైపు నవ్వులు పంచుతోంది. కామెడీ, హారర్‌ రెండింటిని బ్యాలన్స్‌ చేస్తూ ఆసక్తికరంగా కథనాన్ని సాగించాడు. ఇక ప్రత్యేక పాటలో తమన్నా స్టెప్పులేయడం.. అక్షయ్‌ కుమార్‌ అతిథి పాత్ర లో కనిపించడం సినిమాకు మరో స్పెషల్‌ అట్రాక్షన్‌. ఈ చిత్రం కచ్చితంగా 500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని సీనీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)