Breaking News

'ప్రతి ఒక్కరూ మేధావులు అనుకుంటారు'.. బాబీ సింహా షాకింగ్ కామెంట్స్!

Published on Fri, 07/19/2024 - 19:21

అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం భారతీయుడు-2. శంకర్- కమల్‌ కాంబోలో వచ్చిన ఈ మూవీని 1996లో భారతీయుడుకు సీక్వెల్‌గా తీసుకొచ్చారు. దాదాపు 18 ఏళ్ల తర్వాత సీక్వెల్ రావడంతో అందరి చూపు ఇండియన్‌-2 పైనే ఉంది. జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఊహించని షాకిచ్చింది. తొలిరోజే మిక్స్‌డ్ టాక్ రావడంతో ఫ్యాన్స్‌ నిరాశకు గురయ్యారు. దీంతో వసూళ్లు భారీగా పడిపోయాయి. వారం రోజుల్లో ఇండియా వ్యాప్తంగా కేవలం రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్‌ మాత్రమే రాబట్టింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాబీ సింహాకు నెగెటివ్‌ రివ్యూలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఇండియన్‌-2కు నెగెటివ్‌ రివ్యూలపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు.

బాబీ సింహా మాట్లాడుతూ.. 'ప్రతి ఒక్కరూ  తమకు తాము తెలివైన వారని అనుకుంటారు. సినిమాను విమర్శించడానికి కారణాలను వాళ్లే వెతుక్కుంటారు. మేము అలాంటి వాటిని అస్సలు పట్టించుకోం. కేవలం సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను మాత్రమే గుర్తుంచుకుంటాం. రివ్యూలు ఇచ్చే కొందరు మేధావుల అభిప్రాయాలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు' అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

అంతే కాకుండా ఇండియన్-3 చూసే వరకు ఇండియన్ -2ని అంచనా వేయకూడదని సూచించారు. అయితే బాబీ సింహా కామెంట్స్‌పై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. సినిమా నచ్చకపోతే మీ పొరపాట్లను సరిదిద్దుకోవాలని సలహాలు ఇస్తున్నారు. అయితే మరికొందరు బాబీని సమర్థించారు. ఎప్పుడూ నెగెటివ్‌ రివ్యూలు ఇచ్చే మేధావుల గురించే ఆయన స్పష్టంగా మాట్లాడారని అంటున్నారు.

కాగా.. ఇండియన్‌-2 చిత్రంలో బాబీ సింహా కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీలో కమల్‌హాసన్‌ సేనాపతి పాత్రలో నటించగా.. ఆయనను పట్టుకునే సీబీఐ ఆఫీసర్‌గా బాబీ మెప్పించారు.  ఇందులో సిద్ధార్థ్, ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్, సముద్రఖని కూడా నటించారు.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)