Breaking News

Bimbisara: రెండో రోజు అదే జోరు.. ఊహించని కలెక్షన్స్‌!

Published on Sun, 08/07/2022 - 13:31

చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ కళకళలాడుతోంది.  ఈ శుక్రవారం (ఆగస్ట్‌ 05) విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు రెండూ హిట్‌ టాక్‌తో దూసుకెళ్తున్నాయి. వీటిలో కలెక్షన్స్‌ పరంగా బింబిసార ఒకడుగు ముందు ఉంది. కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి యంగ్‌ డైరెక్టర్‌ వశిష్ట్‌ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై హ‌రికృష్ణ నిర్మించారు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.

(చదవండి: హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్?)

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే  హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఈ  చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.7.27 కోట్ల షేర్‌ కలెక్షన్లను రాబట్టగా.. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగింది. రెండో రోజు ఈ చిత్రం రూ.4.52 కోట్లను రాబట్టింది.

ఈ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ట్రేడ్‌ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రం రెండు రోజులకి రూ.12.37 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు రూ.3.63 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగితే ఈజీగా బ్రేక్‌ ఈవెన్‌ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

బింబిసార’ రెండు రోజుల  కలెక్షన్స్‌..

► నైజాం - రూ. 3.92 కోట్లు

► సీడెడ్ - రూ. 2.24 కోట్లు

► ఈస్ట్ - రూ. 70 లక్షలు

► వెస్ట్ - రూ.55 లక్షలు

► ఉత్త‌రాంధ్ర - రూ.1.55 కోట్లు

► గుంటూరు- రూ.89 లక్షలు

► కృష్ణా - రూ.59 లక్షలు

► నెల్లూరు - రూ.38 లక్షలు

► కర్ణాటక, రెస్టాఫ్‌ ఇండియా-  రూ. 0.50 లక్షలు

► ఓవర్సీస్‌ రూ.1.05 కోట్లు

► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 12.37 కోట్లు(రూ.20 కోట్ల గ్రాస్‌)

Videos

ఖాళీ కుర్చీలతో మహానాడు.. తొలిరోజే అట్టర్ ఫ్లాప్

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)