Breaking News

బిగ్‌బాస్‌ 8: తెరపైకి కొత్త కంటెస్టెంట్లు.. విచిత్రమేంటంటే?

Published on Thu, 08/22/2024 - 12:47

బిగ్‌బాస్‌ షురూ అవుతుందంటే చాలు ఫ్యాన్స్‌ హంగామా మామూలుగా ఉండదు. ఎప్పుడెప్పుడు కొత్త ప్రోమో రిలీజ్‌ అవుతుందా? ఈసారి ఎవరెవరు వస్తారా? అని సోషల్‌ మీడియాలో తెగ ఆరా తీస్తుంటారు. గత సీజన్‌ పుణ్యమా అని జనాల్లో ఈ ఉత్సాహం మళ్లీ కనిపిస్తోంది. మరి ఈసారి ఎలా ఉంటుందనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

వచ్చే వారమే బిగ్‌బాస్‌ 8
అయితే ఈసారి ఏయే కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లనున్నారనేదానిపై ఇంతవరకు స్పష్టతర రాలేదు. వారం రోజుల్లో  (సెప్టెంబర్‌ 1న) షో పెట్టుకుని ఇంతవరకు జాబితా ఫైనల్‌ చేయకపోవడం నిజంగానే విడ్డూరం! బిగ్‌బాస్‌ టీమ్‌ సెలక్ట్‌ చేసిన లిస్టులో కొందరి పేర్లు ఈపాటికే లీకయ్యాయి. అందులో కొందరైతే చాలామందికి తెలియను కూడా తెలీదు. ఏదేమైనా ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల జాబితా ఇదేనంటూ నెట్టింట ఓ లిస్టు వైరలవుతోంది. దీని ప్రకారం.. సీనియర్‌ నటి సనా హౌస్‌లోకి రానుందట.

ప్రచారంలో కొత్త పేర్లు
కమెడియన్‌ యాదమ్మ రాజు, నటి అంజలి పవన్‌, యాంకర్‌ రీతూ చౌదరి, యాంకర్‌ సౌమ్య రావు, ఏక్‌నాథ్‌ హారిక, సింగర్‌ సాకేత్‌ కంటెస్టెంట్లుగా దాదాపు కన్ఫార్మ్‌ అయ్యారట! కృష్ణ ముకుంద మురారీ సీరియల్‌ ఫేమ్‌ యష్మి గౌడ కూడా బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది. యువసామ్రాట్‌, హర్షసాయి, విష్ణుప్రియ, బంచిక్‌ బబ్లూ, సోనియా సింగ్‌, బెజవాడ బేబక్క పేర్లు వినిపించినా ఇంతవరకు ఫైనల్‌ కాలేదని భోగట్టా!

ఆమె తప్పుకుందా?
నటుడు ప్రభాకర్‌, కిర్రాక్‌ ఆర్పీ, ఇంద్రనీల్‌, అనిల్‌ గీల, బుల్లితెర నటుడు రవితేజ, సెల్వరాజ్‌, మోడల్‌ సయ్యద్‌ రోహన్‌ అబుల్‌ పేర్లు వినిపిస్తున్నాయి. గత సీజన్‌ రన్నరప్‌ అమర్‌దీప్‌ భార్య తేజస్విని గౌడ కూడా షోలోకి వస్తుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే పారితోషికం దగ్గర చర్చలు విఫలం కావడంతో ఆమె ఈ సీజన్‌ నుంచి తప్పుకుందట. బహుశా నెక్స్ట్‌ సీజన్‌కు వద్దామని ఈసారి సైడ్‌ అయిపోయిందేమో!

చదవండి: Chiranjeevi Birthday: సుప్రీమ్‌ హీరో.. మెగాస్టార్‌గా..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)