Breaking News

నాన్నతో మనసారా మాట్లాడా.. అదే ఆఖరి రోజు.. పృథ్వీ ఎమోషనల్‌

Published on Fri, 09/13/2024 - 19:12

నిన్న గొడవలతో వేడెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌ నేడు ఎమోషనల్‌గా మారనుంది. కంటెస్టెంట్లకు సంబంధించిన గిఫ్టులను ముందుపెట్టిన బిగ్‌బాస్‌ ఇవి అందరికీ కాదని, కొందరికి మాత్రమేనని తిరకాసు పెట్టాడు. దీంతో హౌస్‌మేట్స్‌ తమకు వచ్చిన గిఫ్టులను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఆ బహుమతుల వెనక ఉన్న స్టోరీని బయటపెట్టారు.

మణికంఠ సూపర్‌..
తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో.. ఆదిత్య తన తండ్రి ఫోటో చూసి ఎమోషనల్‌ అయ్యాడు. నాలో ఉన్న చెడు లక్షణాలు నేనే నేర్చుకున్నాను.. కానీ మంచి లక్షణాలు మాత్రం తన తండ్రి నుంచే వచ్చాయన్నాడు. మణికంఠకు శాలువా లాంటిది వచ్చింది. అయితే కంటెస్టెంట్లు దాన్ని ఏదో సింపతీతో తనకు ఇవ్వాలని మాత్రం కోరుకోవడం లేదన్నాడు.

కరోనా టైంలో నాన్న..
ఇప్పటికే సింపతీ గేమ్‌ అన్న ముద్ర పడటంతోనే తను గిఫ్టును సైతం ఆశించకుండా గుండె రాయి చేసుకుని నిలబడ్డాడు. నబీల్‌ వంతు రాగా.. మా నాన్నతో దిగిన చివరి ఫోటో ఇదే.. ఆయన కరోనా వల్ల చనిపోయారని తెలిపాడు. పృథ్వీ మాట్లాడుతూ.. ఆగస్టు 15న నేను మా నాన్నతో చాలా సేపు మాట్లాడాను. అదే ఆయన చివరి రోజు అవుతుందనుకోలేదు అని చెప్పాడు. 

నాన్న ప్రేమ తెలీదు
ఇక చివర్లో బాషా తండ్రి గొప్పదనం గురించి చెప్తూ ఏడ్చేశాడు. మనందరికీ నాన్నంటే చాలా ఇష్టం. కానీ నాన్నకు మనమంటే ఎంతిష్టమనేది చాలామందికి తెలియదు. మీరు నాన్నయితే తప్ప ఆ ప్రేమ తెలియదు అని ఏడ్చేశాడు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)