Breaking News

బిగ్‌బాస్‌ ఎలిమినేషన్‌: వరుసగా ఆరో వారమూ అమ్మాయేనా?

Published on Fri, 10/13/2023 - 11:33

బిగ్‌బాస్‌ హౌస్‌కు గ్లామర్‌ టచ్‌ కావాలంటే అమ్మాయిలుండాల్సిందే! అందుకే షో ప్రారంభంలో 14 మంది కంటెస్టెంట్లను తీసుకువస్తే అందులో ఏడుగురు అమ్మాయిలే ఉన్నారు. కానీ ఏం లాభం? వరుసపెట్టి అమ్మాయిలనే హౌస్‌ నుంచి పంపించేస్తూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు ఐదుగురు అమ్మాయిలు ఎలిమినేట్‌ అవుతూ వచ్చారు. మొదట కిరణ్‌ రాథోడ్‌.. తనకు తెలుగు రావడం లేదని పంపించేశారు. షకీల.. కంటెంట్‌ కోసం అతి చేయకుండా హుందాగా వ్యవహరించింది. ఇలా ఒద్దికగా, పద్ధతిగా ఉంటే మాకెందుకు అనుకున్నారో ఏమో.. తననూ పంపించేశారు.

అలా ఒక్కొక్కరూ వెళ్లిపోయారు
దామిని.. సింగర్‌గా తన టాలెంట్‌ చూపించే ఈ బ్యూటీ కిచెన్‌లో వండి వార్చడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఈ వంటలక్క మాకొద్దని తనను పంపించేశారు. రతిక రోజ్‌.. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనుకున్నారంతా! పోయి పోయి పల్లవి ప్రశాంత్‌తో పెట్టుకుంది. అతడితోనే లవ్‌ ట్రాక్‌ నడిపి, వర్కవుట్‌ కాకపోవడంతో ప్లేటు తిప్పేసింది. అదే ఆమెను దెబ్బ కొట్టింది, ఆ దెబ్బకు బిగ్‌బాస్‌ హౌస్‌ బయటకు వచ్చి పడింది. శుభశ్రీ.. ఈ అందాల సుందాంగి గేమ్‌ ఆడటం మొదలుపెట్టింది. కానీ ఇంత ఆలస్యంగా గేమ్‌ స్టార్ట్‌ చేసి మా మనోభావాలు దెబ్బతీశావంటూ తనను కూడా ఎలిమినేట్‌ చేసేశారు.

తేజ లేక హౌస్‌ డల్‌.. కాబట్టి అతడికి నో!
నెక్స్ట్‌ ఎవరు? అన్నది అసలైన ప్రశ్న. ఈవారం నామినేషన్‌లో ఏడుగురు ఉన్నారు. అమర్‌దీప్‌, ప్రిన్స్‌ యావర్‌, తేజ, శోభా శెట్టి, నయని పావని, అశ్విని శ్రీ, పూజా మూర్తి.. వీరంతా నామినేషన్‌లో ఉన్నారు. ఇందులో అమర్‌దీప్‌, ప్రిన్స్‌ ఇప్పుడప్పుడే ఎలిమినేట్‌ అయ్యే కంటెస్టెంట్లు కానే కాదు. తేజ లేకపోతే హౌస్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేదే ఉండదు. కాబట్టి మరికొన్నాళ్లు అతడిని హౌస్‌లో ఉంచే ఛాన్స్‌ ఉంది. మిగిలిందల్లా నయని పావని, శోభ, అశ్విని, పూజా మూర్తి.. నలుగురూ ఆడపిల్లలే! వీరిలో శోభ ముందు నుంచీ ఉన్న కంటెస్టెంట్‌ కాబట్టి ఫాలోయింగ్‌ దండిగా ఉంటుంది, గండం గట్టెక్కుతుందనుకుంటున్నారేమో.. సోషల్‌ మీడియా నడుస్తున్న ప్రచారం ప్రకారం ఈ వారం మోనితనే ఎలిమినేట్‌ కానుందట!

చేజేతులా ఎలిమినేషన్‌ కొనితెచ్చుకుంటున్న మోనిత
తన తిక్కకు లెక్క లేదన్నట్లుగా ప్రవర్తిస్తోంది శోభా శెట్టి. గేమ్‌లో సవ్యంగా ఆడటానికి బదులు అడ్డదిడ్డంగా ఆడుతోంది. తనే తోపు అన్నట్లుగా మాట్లాడుతోంది. ప్రేక్షకులకు ఇదంతా చిరాకు తెప్పిస్తోంది. తనను పంపించేస్తే అప్పుడు తన గ్రూపులో ఉన్న మిగతా వాళ్లు కూడా సరైన దారిలోకి వస్తారని అభిప్రాయపడుతున్నారు. అయినా అశ్విని, పూజా, నయని ఉండగా శోభకు తక్కువ ఓట్లు రావడమేంటో అర్థం కావడం లేదని మరికొందరు తల గోక్కుంటున్నారు. ఏదేమైనా ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్‌ అయ్యేట్లు కనిపిస్తోంది. మరి బయటకు వెళ్లేది మోనితనా? లేదంటే వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్లా? అన్నది తెలియాల్సి ఉంది.

చదవండి: శోభా ఓవరాక్షన్‌.. ఆటలో మరీ ఇంతలా దిగజారాలా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)