Breaking News

ఆ ఒక్క ప్ర‌శ్న‌ అడ‌గొద్దంటున్న తేజ‌.. ఇలా దొరికిపోయాడేంటి!

Published on Mon, 11/06/2023 - 16:47

టేస్టీ తేజ‌.. సందీప్ మాస్ట‌ర్‌.. ఇద్ద‌రూ హౌస్‌లో ఉన్న‌ప్పుడు బాగానే ఉన్నారు. కానీ ఎలిమినేట్ అయ్యాకే అస‌లు గొడ‌వ మొద‌లైంది.. ఎనిమిది వారాలుగా నామినేష‌న్స్‌లోకి రాకుండా త‌న‌ను తాను కాపాడుకుంటూ వ‌స్తున్న సందీప్‌ను నామినేష‌న్స్‌లోకి లాక్కొచ్చాడు తేజ‌. దీంతో ఆ వార‌మే సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. దీన్ని ఆయ‌న మ‌న‌సులో పెట్టుకున్నాడు. అంతేకాదు, తేజ ఎలిమినేట్ అవుతున్నాడ‌న‌గానే ఎగిరి గంతేశాడు. అంద‌రినీ ఎలిమినేట్ చేస్తూ చివ‌ర‌కు త‌నే ఎలిమినేట్ అయ్యాడు అని సెటైర్లు కూడా వేశాడు. 

ఎవ‌రు చెప్పేది నిజం? ఎవ‌రు చెప్పేది అబ‌ద్ధం?
అయితే సందీప్ మాస్ట‌ర్‌ను కావాల‌ని నామినేట్ చేయ‌లేద‌ని, త‌నే అడిగి చేయించుకున్నాడ‌ని బిగ్‌బాస్ హౌస్‌లో కుండ బ‌ద్ధ‌లు కొట్టి చెప్పాడు తేజ‌. అది అబ‌ద్ధం, నేనెందుకు అడిగి మ‌రీ చేయించుకుంటాన‌ని ఆగ్ర‌హించాడు సందీప్‌. ఈ విష‌యం ద‌గ్గ‌రే గొడ‌వ మొద‌లైంది. వీరిద్ద‌రిలో ఎవ‌రు చెప్పేది నిజం? ఎవ‌రు చెప్పేది అబ‌ద్ధం? అనేది అర్థం కాక  అభిమానులు త‌ల ప‌ట్టుకుంటున్నారు. తాజాగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బ‌య‌ట‌కు వ‌చ్చిన తేజ‌కు ఓ ఇంట‌ర్వ్యూలో ఇదే ప్ర‌శ్న ఎదురైంది. సందీప్ మాస్ట‌ర్ నిన్ను అడిగి మ‌రీ నామినేట్ చేయించుకున్నాడా? అని యాంక‌ర్ అడిగాడు.

త‌ట‌ప‌టాయించిన తేజ‌
ఈ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చేందుకు తేజ త‌ట‌ప‌టాయించాడు. 'హౌస్‌ లోప‌ల ఏం జ‌రిగింద‌నేది మీకు తెలియ‌దు. దీని గురించి ఇప్పుడేం మాట్లాడ‌ద‌ల్చుకోలేదు. సందీప్‌, నేను క‌లిసి ఈ విష‌యంపై ఓ వీడియో చేస్తాం' అంటూ ఆ ప్ర‌శ్న దాట‌వేశాడు. త‌ర్వాత‌ ఏ ప్ర‌శ్న‌ల‌డిగినా ట‌పీమ‌ని సమాధానాలు చెప్పుకుంటూ పోయిన తేజ ఈ ఒక్క విష‌యంపై మాత్రం మాట్లాడ‌టానికే ఇష్ట‌ప‌డ‌లేదు. దీంతో త‌ప్పు తేజ‌దేనా? అత‌డు కావాల‌నే అబ‌ద్ధం చెప్పి ఉంటాడా? అని అనుమానిస్తున్నారు జ‌నాలు. స‌మాధానం చెప్ప‌ను అంటున్నాడంటే క‌చ్చితంగా త‌ప్పు చేసిన‌ట్లే.. తేజ అడ్డంగా దొరికిపోయాడు అని మ‌రికొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఓ టాస్కులో త‌న‌కు తెలియ‌కుండానే గౌత‌మ్‌ను గ‌ట్టిగా కొట్టాడు తేజ‌. అందుకు అత‌డి ఇంటికి వెళ్లి మ‌రీ గౌత‌మ్ పేరెంట్స్‌కు సారీ చెప్తానంటున్నాడు.

చ‌ద‌వండి: తేజ తొమ్మిది వారాల్లో ఎంత సంపాదించాడంటే?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)