Breaking News

ఎవరో ఒకర్ని కొట్టేసి పోతానన్న శివాజీ.. దేవుడు చూస్తాడట!

Published on Wed, 10/25/2023 - 10:43

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ వారం నామినేషన్స్‌తో బుర్ర హీటెక్కిపోయింది. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడేశారు. మొన్నటివారమే బూతులు మాట్లాడాడని భోలె షావళికి నాగార్జున గట్టిగానే క్లాస్‌ పీకాడు. ఆ సంగతి కూడా మర్చిపోయి అమర్‌దీప్‌, సందీప్‌, గౌతమ్‌.. అందరూ తామేమీ తక్కువ కాదంటూ బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు. ఇక శివాజీ మాత్రం ఎప్పటిలాగే అందరిముందు మంచిగా నటించాడు.

శివాజీ ఫ్రస్టేషన్‌
కానీ నామినేషన్స్‌ అయ్యాక మాత్రం తన ఆవేశాన్నంతా బయటపెట్టాడు. సీరియల్‌ బ్యాచ్‌ మీద విషం కక్కాడు. 'దొంగలు దొంగ.. దొంగ.. అని పరిగెట్టిస్తున్నారు. జనాలు చూస్తారు. ఇప్పుడన్నా మనుషులు, ప్రజలు అనే వాళ్లుంటే ఈ వారం చూస్తా.. ఈ వారాన్ని బట్టి ఈ హౌస్‌లో ఉంటా.. తర్వాత ఎవరినో ఒకరిని కొట్టి నేనే స్వచ్ఛందంగా వెళ్లిపోతా. ఇక్కడున్నవాళ్లంతా ఏం చేస్తున్నారు? ఈ హౌస్‌ అంతా డిస్టర్బ్‌ అవుతుంటే ఏంటిదంతా? మరీ ఇంత అన్యాయమా? ఈ వారం తెలుస్తుంది.. ఎందుకంటే ఈ వారం పర్ఫెక్ట్‌గా నామినేషన్స్‌ పడ్డాయి.. ఇప్పుడు దేవుడు చూడాలి' అని మాట్లాడాడు.

జనాలేమీ పిచ్చోళ్లు కాదు!
హౌస్‌లో శివాజీ ఏం చెప్పినా ప్రిన్స్‌ యావర్‌, ప్రశాంత్‌ వింటారు. తను ఏం మాట్లాడినా గొర్రెల్లా తలూపుతారు. కానీ జనాల్ని కూడా మానిప్యులేట్‌ చేయాలనుకుంటున్నాడు శివాజీ. అదంత ఈజీ కాదు.. జనాలు ఆట తీరును చూసి ఓట్లేస్తారు, కానీ ఒకరు చెప్పగానే చేతులు కట్టుకుని దాన్ని ఫాలో అయిపోరు. పైగా ఒకరిని కొట్టేసి వెళ్లిపోతా అనడం చాలా పెద్ద మాట అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నామినేషన్స్‌ రచ్చతో ప్రేక్షకుల తలలు కూడా బొప్పి కట్టాయి. మరి ఈ వారం ఎవరిని పంపించేస్తారో చూడాలి!

చదవండి: ఆ ఇద్దరికీ ఫుల్‌ సపోర్ట్‌.. కానీ అతను పూర్తిగా మారిపోయాడు.. పూజా మూర్తి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)