Breaking News

వీడియోతో దొరికిపోయిన తేజ.. బయటకు పంపించేద్దామంటూ పనిష్మెంట్‌!

Published on Sat, 09/30/2023 - 17:25

'బిగ్‌బాస్‌ హౌస్‌లో హింసకు చోటు లేదు' ఈ నియమం ఇప్పటిది కాదు. తొలి సీజన్‌నాటి నుంచే ఈ రూల్‌ ఉంది. అయినా టాస్కులు జరిగేటప్పుడు కొన్నిసార్లు ఈ రూల్‌ బ్రేక్‌ అవుతూ ఉంటుంది. అప్పుడు నాగార్జున చేత కంటెస్టెంట్లకు కోటింగ్‌ కూడా ఉంటుంది. ఈ సారీ అదే జరిగింది. కాకపోతే ఇదేమీ కొట్టుకునేంత ఫిజికల్‌ టాస్క్‌ కాదు. అయినా తేజ బెల్ట్‌తో గౌతమ్‌ను టపాటపా కొట్టాడు. హౌస్‌లో ఉన్నవాళ్లకు ఎలా ఉందో కానీ చూసే జనాలకు మాత్రం గొడ్డును బాదినట్లు బాదాడనిపించింది.

తను కావాలని చేయకపోయినా బెల్ట్‌తో మెడపై అంత గట్టిగా కొట్టడం.. అక్కడున్నవాళ్లు వద్దని హెచ్చరిస్తూ కేకలు పెడుతున్నా తన చర్యలు ఆపకోవడం గమనార్హం. ఇలాంటి అరాచకాన్ని ప్రశ్నించేందుకు రెడీ అయ్యాడు నాగార్జున. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. గౌతమ్‌ను తేజ ఎలా బాదాడో వీడియో చూపించాడు నాగ్‌. సంచాలకుడిగా ఉన్న సందీప్‌ అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడని విమర్శించాడు. అన్నింటికీ బాస్‌లా పోజు కొట్టే శివాజీ సైతం నిమ్మకు నోరెత్తనట్లు ఉండటంతో అతడినీ ఏకిపారేశాడు. మీ ఇద్దరికీ కళ్లు కనబడట్లేదా? అని తిట్టిపోశాడు. 

తర్వాత తప్పు చేసిన తేజను చెడుగుడు ఆడుకున్నాడు. అక్కడ అమ్మాయిలు భయంతో అరుస్తుంటే వినబడట్లేదా? అని నాగ్‌ ప్రశ్నించగా.. అది ఎంకరేజ్‌మెంట్‌ అనుకున్నానని నీళ్లు నమిలాడు తేజ. తేజ చేసిన తప్పుకు ఏ శిక్ష వేయాలని కంటెస్టెంట్లనే తిరిగి ప్రశ్నించాడు నాగ్‌. శుభశ్రీ.. అతడిని జైల్లో వేయాలంది. ప్రియాంక.. జైలు శిక్ష కూడా తక్కువేనంది. సందీప్‌ అయితే ఏకంగా అతడిని బయటకు పంపించేయాలన్నాడు. దీంతో తేజ తప్పు తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

చదవండి: ఓటీటీలో నిత్యా జోరు, మరో కొత్త వెబ్‌ సిరీస్‌ డేట్‌ వచ్చేసింది.. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కా!

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)