Breaking News

తన గొయ్యి తనే తీసుకున్న రోహిత్‌, తప్పించుకున్న వాసంతి!

Published on Thu, 10/13/2022 - 15:43

బిగ్‌బాస్‌ షో మొదలై 50 రోజులైనా కాలేదు, అప్పుడే కంటెస్టెంట్లను సర్‌ప్రైజ్‌లతో ముంచెత్తుతున్నాడు బిగ్‌బాస్‌. బ్యాటరీ రీచార్జ్‌ టాస్క్‌ ద్వారా హౌస్‌మేట్స్‌కు వారి ఇంటిసభ్యుల నుంచి ఆడియో కాల్‌, వీడియో మెసేజ్‌, ఫొటో ఫ్రేమ్‌, బిర్యానీ.. ఇలా తమకు నచ్చిన ఆప్షన్లను సెలక్ట్‌ చేసుకునే అవకాశం కల్పించాడు. అయితే ఇందుకోసం ఇంటిసభ్యుల నుంచి కొన్ని త్యాగాలను ఆశిస్తున్నాడు.

ఈ క్రమంలో బాలాదిత్య సిగరెట్లు మానేయగా ఫైమా అతి కష్టం మీద ఇంగ్లీష్‌లో సినిమా కథలను వివరించింది. తాజాగా బిగ్‌బాస్‌ వీటన్నిటికంటే క్లిష్టమైన త్యాగాన్ని కోరినట్లు తెలుస్తోంది. వాసంతి, రోహిత్‌లలో ఎవరైనా ఒకరు రెండు వారాలపాటు స్వతాహాగా నామినేట్‌ కావాలని ఆదేశించాడు. దీంతో రోహిత్‌ తాను నామినేట్‌ అవడానికి సిద్ధమని వెల్లడించాడు.

ఇక్కడ బిగ్‌బాస్‌.. కంటెంట్‌ ఇవ్వని రోహిత్‌, వాసంతిలలో ఒకరిని బయటకు పంపించేందుకే వారిద్దరి పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వారిద్దరూ గేమ్‌ ఆడట్లేదు, ఎంటర్‌టైన్‌ కూడా చేయట్లేదు.. ఇప్పుడు రోహిత్‌ సెల్ఫ్‌ నామినేట్‌ కావడంతో అతడు త్వరలోనే ఎలిమినేట్‌ అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపోతే తాజాగా రిలీజైన ప్రోమోలో రేవంత్‌కు ఫొటో ఫ్రేమ్‌, కీర్తికి మానస్‌ ఆడియో మెసేజ్‌, ఫైమాకు వీడియో కాల్‌ వచ్చినట్లు చూపించారు. మరి ఈ సర్‌ప్రైజ్‌లతో బూస్ట్‌ అందుకున్న హౌస్‌మేట్స్‌ ఇకనైనా గేమ్‌లో తమ ప్రతాపం చూపిస్తారా? లేదా? అనేది చూడాలి!

చదవండి: విన్నర్‌ అయిపోతానన్న గీతూ, అంతొద్దు.. కేవలం టాప్‌ 5లోనే ఉంటావన్న తండ్రి

Videos

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)