మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
రాజ్‌ను భయపెట్టమన్న నాగ్, మెరీనాకు ఆ ఛాన్స్ లేదే!
Published on Sun, 11/20/2022 - 17:42
శనివారం కోటింగ్‌లు.. సండే ఫన్ టాస్కులూ తెలిసిన విషయమే.. ఈసారి కూడా అదే జరిగింది. కాకపోతే నిన్నటి ఎపిసోడ్‌లో ఆదిరెడ్డికి మరీ ఓ రేంజ్‌లో క్లాస్ పీకాడు నాగార్జున. ఈరోజు అవన్నీ పక్కనపెట్టేసి హౌస్‌మేట్స్‌తో చిన్నపిల్లల ఆటలు ఆడించాడు. ఏ ఆటైతే ఏంటి? ఆడేందుకు రెడీ అన్న హౌస్‌మేట్స్ రెండు టీములుగా విడిపోయి ఆడారు.
ఇకపోతే రాజ్‌కు దెయ్యాలంటే భయమన్న విషయాన్ని బయటపెట్టాడు నాగ్. ఈరోజు మెరీనా, శ్రీసత్య, ఫైమా. దెయ్యాల వేషం వేసుకుని రాజ్‌ను భయపెట్టాలన్నాడు. ఫైమా వేషం వేసుకోనక్కర్లేదు, ఇప్పటికే ఆమెకు భయపడుతున్నాడని శ్రీసత్య మధ్యలో అందుకుంది. అంటే ఫైమా దెయ్యంలా ఉందంటున్నావా? అని కౌంటర్ వేశాడు నాగ్. ఎలాగో మెరీనా అవుట్ కాబట్టి తను భయపెట్టలేదు.
చదవండి: ఇనయ టాప్ 5లో కాదు, చివరి స్థానంలో ఉందట
ఈ వారం ఎలిమినేట్ అయింది ఎవరంటే?
Tags : 1