Breaking News

విన్నర్‌ కంటే ఎక్కువ గెల్చుకున్న శ్రీహాన్‌, ఎన్ని లక్షలో తెలుసా?

Published on Sun, 12/18/2022 - 22:01

బ్రీఫ్‌కేస్‌... బిగ్‌బాస్‌ షో ఫినాలేలో ఇంట్రస్టింగ్‌ అంకం అది. గత సీజన్లలో ఓడిపోయి వట్టి చేతులతో వెళ్లేబదులు సూట్‌కేస్‌ అందుకుని హౌస్‌ నుంచి సంతృప్తిగా బయటకు వచ్చేసినవాళ్లు ఉన్నారు. మరి ఈ సీజన్‌లో ఎవరైనా సూట్‌కేసు అందుకుంటారా? అంటే డౌటే అన్న అనుమానం వ్యక్తమైంది.

హౌస్‌లో టాప్‌ 3 కంటెస్టెంట్లు మిగిలినప్పుడు రవితేజ సూట్‌కేస్‌ పట్టుకుని వెళ్లాడు. మొదట ప్రైజ్‌మనీలో నుంచి పది శాతం ఇస్తానని తర్వాత దాన్ని 30 శాతం వరకు తీసుకెళ్లాడు. అయినా సరే ఎవరూ దాన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదు. కీర్తిని ఆమె ఫ్రెండ్‌ డబ్బులు తీసుకోమని చెప్పినా ఆమె వద్దని తలాడించి చివరికి ఖాళీ చేతులతో బయటకు వచ్చేసింది. తర్వాత శ్రీహాన్‌, రేవంత్‌.. ఇద్దరు మాత్రమే మిగిలారు. 

దీంతో నాగార్జున గోల్డెన్‌ బ్రీఫ్‌కేసుతో హౌస్‌లోకి వెళ్లాడు. రూ.25 లక్షలున్న బ్రీఫ్‌కేసును ఎవరు సొంతం చేసుకుంటారని అడిగాడు. ఇద్దరూ వద్దనేసరికి ఆఫర్‌ను రూ.30 లక్షలకు పెంచాడు. ఆరోహి, కీర్తి, అభినయ, మెరీనా, రోహిత్‌, సుదీప మినహా మిగతా అందరూ శ్రీహాన్‌ సూట్‌కేసు తీసుకోవడమే మంచిదని చెప్పారు. అందరి అభిప్రాయం అడిగిన తర్వాత ఇద్దరూ సూట్‌కేసు తీసుకోవడానికి ససేమీరా అన్నారు. దీంతో నాగ్‌ ఆ డబ్బును రూ.40 లక్షలకు పెంచాడు. మొదట్లో సూట్‌కేసు తీసుకోవద్దన్న శ్రీహాన్‌ తండ్రి చివరికి తీసుకోమని చెప్పాడు. తండ్రి మాట విన్నాక శ్రీహాన్‌ అమ్మానాన్న కోసం తీసుకుంటున్నానన్నాడు. అలా రన్నరప్‌గా శ్రీహాన్‌ రూ.40 లక్షలు గెల్చుకోగా, విన్నర్‌ రేవంత్‌కు కేవలం రూ.10 లక్షలు మాత్రమే మిగిలాయి.

చదవండి: ఆ ముగ్గురి కంటే ముందే ఎలిమినేట్‌ అయినందుకు హ్యాపీ: ఆదిరెడ్డి
మరికొద్ది గంటల్లో పెళ్లి.. పెళ్లికూతురి గెటప్‌లో ఫినాలేకు వచ్చిన నేహా చౌదరి

Videos

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)