Breaking News

రేవంత్‌ తండ్రి చనిపోయినా దుబాయ్‌లో ఉన్నాడని అబద్ధం చెప్పా

Published on Fri, 12/16/2022 - 16:47

టాస్కుల్లో రేవంత్‌ను కొట్టేవాడే లేడు. కానీ వ్యక్తిత్వంలో మాత్రం అతడు ఎక్కడో వెనక స్థానంలో ఉన్నాడు. మిగతావాళ్లను చులకన చేయడం, తనే తోపునని ఫీలవడం, టాస్కుల్లో ఫిజికల్‌ అవడం, ఓటమిని జీర్ణించుకోలేని తత్వం.. ఇలా చాలా మైనస్‌లే ఉన్నాయి. కానీ షో మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఒకేలా ఉన్నాడు. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడతాడు. అందరితో గొడవలు పడతాడు, మళ్లీ కాసేపటికే సారీ చెప్పి కలిసిపోతాడు. అలా రేవంత్‌లో ప్లస్‌లు, మైనస్‌లు రెండూ ఉన్నాయి. ప్రస్తుతం ట్రెండ్‌ చూస్తుంటే రేవంత్‌ కప్పు కొట్టేలా ఉన్నాడు. ఈ క్రమంలో రేవంత్‌ తల్లి సీతా సుబ్బలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

'నా భర్త పేరు శంకర. నాకు మొదట కొడుకు పుట్టాడు. తర్వాత రేవంత్‌ కడుపులో ఉండగానే నా భర్త చనిపోయాడు. మా ఆయన లేకపోయినా బంగారంలాంటి పిల్లల్నిచ్చారని ఎప్పుడూ తలుచుకుంటాను. భర్త లేకుండా ఇద్దరు పిల్లల్ని పెంచానంటే అది నా ఫ్యామిలీ వల్లే.. మా నాన్న, అమ్మ, అన్నయ్యలు, వదినలు.. నన్ను, నా పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. వాళ్లు అండగా లేకపోతే నేను రోడ్డున పడేదాన్ని.

రేవంత్‌ పుట్టాక నీకు నాన్న లేడని చెప్తే ఎక్కడ మనసులో పెట్టుకుంటాడోనని నిజం దాచాను. మీ నాన్న దుబాయ్‌లో ఉంటారు.. నిదానంగా వస్తారులే అని చెప్పేవాళ్లం. వాడిని చూస్తే నాకు ఇప్పటికీ బాధగా ఉంటుంది. ఎందుకంటే వాడు తండ్రి ప్రేమకు నోచుకోలేదు. భగవంతుడు ఎందుకా లోటు మిగిల్చాడని ఎప్పుడూ బాధపడేదాన్ని. రేవంత్‌కు నా లక్షణాలే వచ్చాయి. కానీ అంత కోపం నాకు లేదు. వాడి కోపం కాసేపే ఉంటుంది. తర్వాత మామూలైపోయి సారీ చెప్తాడు' అని చెప్పుకొచ్చింది రేవంత్‌ తల్లి.

చదవండి: కీర్తి ఎలిమినేట్‌ అవుతుందన్న హౌస్‌మేట్స్‌, ఝలక్‌ ఇవ్వనున్న బిగ్‌బాస్‌

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)