Breaking News

బిగ్‌బాస్‌: రెండో వారం ఉమాదేవి అవుట్‌!

Published on Sun, 09/19/2021 - 00:01

Bigg Boss 5 Telugu Second Week Elimination: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో రెండో వారం ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఈ వారం ఏడుగురు కంటెస్టెంట్లు కాజల్‌, లోబో, ప్రియాంక సింగ్‌, ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌, ప్రియ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో లోబో, యానీ మాస్టర్‌, ప్రియాంక సింగ్‌ సేఫ్‌ అయినట్లు నాగ్‌ శనివారం ఎపిసోడ్‌లో ప్రకటించాడు. దీంతో మిగతా నలుగురు నటరాజ్‌ మాస్టర్‌, ఉమాదేవి, ప్రియ, కాజల్‌ డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. వీరిలో ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్‌ ఓటింగ్‌లో చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం 'కార్తీకదీపం' ఫేమ్‌ అర్ధపావు భాగ్యం అలియాస్‌ ఉమాదేవి ఎలిమినేట్‌ అయిందట! ఈ విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్‌టైన్‌ చేసే ఆమెను నిర్దాక్షిణ్యంగా హౌస్‌ నుంచి పంపించివేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇది కరెక్ట్‌ కాదంటూ బిగ్‌బాస్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు.

అందరి మీదా అరుస్తూ కంటెస్టెంట్లను హడలెత్తించే ఉమాదేవిని మొదటివారం సీరియస్‌ యాంగిల్‌లో అదీ కొంత నెగెటివ్‌గానే చూపించారు. కానీ ఈ వారం మాత్రం తనలోని కామెడీ యాంగిల్‌ను పరిచయం చేసి జనాలను కడుపుబ్బా నవ్వించిందీ ఉమా. అలాగే తనను ఎన్ని మాటలన్నా పట్టించుకోకుండా వారితో కలిసిపోవడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు ప్రియాంక సింగ్‌, ఉమాల మధ్య జరిగిన గొడవే ఉదాహరణ. వీళ్లిద్దరి మధ్య ఎంతో పెద్ద గొడవ జరిగినప్పటికీ ఉమా తిరిగి పింకీకి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ కట్టి ఇట్టే కలిసిపోయింది. ఇక లోబోతో ఓవర్‌డోస్‌ కామెడీ చేస్తూ జనాలను నవ్విస్తోంది. కానీ బూతులు మాట్లాడటం, అందరితో గొడవలు పెట్టుకోవడమే ఆమె ఎలిమినేషన్‌కు కారణమని తెలుస్తోంది. 

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)