Breaking News

హమీదాను కొట్టిన శ్వేత! కళ్లలో రంగు పడుతున్నా డోంట్‌ కేర్‌!

Published on Tue, 09/14/2021 - 00:25

Bigg Boss Telugu 5, Episode 09: రెండో వారం నామినేషన్‌ ప్రక్రియ వాడివేడిగా జరిగింది. ఎవరి బలమేంటో తేల్చుకుందాం రండంటూ సవాలు విసిరిన ఉమాదేవి నానాబూతులు కూడా మాట్లాడింది. ఆమె మాటలకు షణ్ముఖ్‌ బిత్తరపోగా యానీ మాస్టర్‌ ఏడ్చేసింది. ఇన్నాళ్లూ ఎంతో కూల్‌గా ఉన్న శ్వేత తనలోని ఉగ్రరూపం చూపించింది. ఆమె కోపానికి కారణమేంటి? ఈ వారం ఎవరెవరు నామినేట్‌ అయ్యారు? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే...

శ్వేతతో ఫ్లర్ట్‌ చేస్తా, ​కానీ ఆ పిల్లకు అర్థం కావట్లే..
కాజల్‌ మరోసారి తన నోటికి పని చెప్పింది. సన్నీలో మన్మథుడు యాంగిల్‌ కనిపించట్లేదని, మానస్‌ ఫ్లర్టింగ్‌ చేస్తాడని, శ్రీరామచంద్ర అయితే అందులో నెక్స్ట్‌ లెవల్‌ అని జెస్సీతో చెప్పుకొచ్చింది. తనకు ఫ్లర్టింగ్‌ రాదన్న జెస్సీ తర్వాత ఓపెన్‌ అయిపోతూ.. శ్వేతతో ఫ్లర్ట్‌ చేస్తాను కానీ ఆ పిల్లకు అర్థం కావట్లేదన్నాడు. ఎలాగో కాజల్‌ చెవిన పడేశాడు కాబట్టి ఆమె త్వరలోనే శ్వేతకు ఈ విషయం చెప్పడం ఖాయం.

నక్క వర్సెస్‌ గద్ద టీమ్‌
మండే రోజు నామినేషన్‌ ప్రక్రియతో మళ్లీ అగ్గి రాజేశాడు బిగ్‌బాస్‌. అందులో భాగంగా ఇంటిసభ్యులను రెండు టీములుగా విడిపోవాల్సి ఉంటుందన్నాడు. నక్క టీములో ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్‌, సన్నీ, కాజల్‌, శ్వేత, నటరాజ్‌ ఉండగా; గద్ద టీములో లోబో, యానీ మాస్టర్‌, శ్రీరామ్‌, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్‌, ప్రియాంక ఉన్నారు. హౌస్‌మేట్స్‌ ఇంటి నుంచి బయటకు పంపేందుకు నామినేట్‌ చేయాలనుకున్న కంటెస్టెంట్‌పై పెయింట్‌ పూయాల్సి ఉంటుందన్నాడు. అయితే ఇంటిసభ్యులు వాళ్ల టీమ్‌ కాకుండా ఇతర టీమ్‌లో నుంచి ఇద్దరిని నామినేట్‌ చేయాల్సి ఉంటుందని మెలిక పెట్టాడు. సిరి కెప్టెన్‌ కావడంతో ఆమెను ఎవరూ నామినేట్‌ చేయడానికి వీల్లేదు.

కిచెన్‌లోకి కాదు, ఆటలోకి రా..: సలహా ఇచ్చిన సన్నీ
మొదటగా సిరి.. ఉమాదేవిని, నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేసింది. నటరాజ్‌ మాస్టర్‌.. ప్రియ మంచి కోసం చెప్పినా తను నన్ను పక్కకు పిలిచి తిట్టేదని, అక్కడ హర్టయ్యాను అంటూ ఆమెను నామినేట్‌ చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన ప్రియ.. మీరు ముందు ఇన్‌ఫ్లూయెన్స్‌ చేయడం ఆపేయండని కౌంటరిచ్చింది. తర్వాత ప్రియాంక సింగ్‌ను నామినేట్‌ చేశాడు. యానీ మాస్టర్‌.. ఉమాదేవి, కాజల్‌ను; సన్నీ.. టాస్కుల్లో ఇంకా యాక్టివ్‌ కావాలని ప్రియను, కిచెన్‌లో ఉండకుండా ఆటలోకి రమ్మంటూ ప్రియాంక సింగ్‌ను నామినేట్‌ చేశాడు.

పెద్ద పెద్ద హీరోలు గుర్తుపడతారు: లోబో సెల్ఫ్‌ డబ్బా
ప్రియాంక.. నటరాజ్‌ మాస్టర్‌ను, 'వంట చేస్తే అందరూ తృప్తిగా తింటారనే వండుతాను, అలా అని కిచెన్‌లో ఉండిపోయి గేమ్‌ ఆడటం లేదంటే ఒప్పుకోను' అంటూ సన్నీని నామినేట్‌ చేసింది. మానస్‌.. తాను కెప్టెన్సీ కాకుండా అడ్డుకున్నందుకు లోబోను నామినేట్‌ చేశాడు. దీన్ని సహించలేకపోయిన లోబో.. LOBO నాటే నేమ్‌, ఇట్స్‌ ఏ బ్రాండ్‌, పెద్ద పెద్ద హీరోలు నన్ను గుర్తుపడతరు అని కాసేపు తనకు తాను డప్పు కొట్టుకున్నాడు. సపోర్ట్‌ చేయాలని పోతే తనకే నామం పెడుతున్నారని అసహనానికి లోనయ్యాడు.  మరి ఇదే మాట గతంలో ప్రస్తావించినప్పుడు ఎందుకు చెప్పలేదని మానస్‌ అడగ్గా.. 'మీరు హీరో కదా! విననీకి రెడీ లేరు, నా ముందు యాటిట్యూడ్‌ చూపిస్తున్నవ్‌, కానీ నా ముందు చిన్నపిల్లోడివి' అని ఆవేశపడ్డాడు. తర్వాత మానస్‌.. ప్రియకు రంగు పూసి నామినేట్‌ చేశాడు.

ఉమాదేవి, కాజల్‌ను నామినేట్‌ చేసిన విశ్వ
అనంతరం విశ్వ.. కంటెస్టెంట్లు కూర లేదన్నప్పుడు నాగార్జున ఇచ్చిన ఆలూ కూర వారికి పెట్టకపోవడం సరికాదంటూ ఉమాదేవిని నామినేట్‌ చేశాడు. అయితే నాగ్‌.. ఆ కూరను ఎవరికీ షేర్‌ చేయొద్దన్నాడని, ఆ మాటకు తాను కట్టుబడి ఉన్నానని ఉమ స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆమె బూతులు కూడా మాట్లాడటంతో ప్రియాంక సింగ్‌ పడీపడీ నవ్వింది. అనంతరం విశ్వ కాజల్‌ను నామినేట్‌ చేశాడు. లహరి.. హమీదా, యానీ మాస్టర్‌ను; హమీదా.. లహరి, సెట్‌ శ్వేత కనబడట్లేదని శ్వేతను నామినేట్‌ చేశారు. ఇక ఉమాదేవి తనవంతు రాగానే ఓ రేంజ్‌లో అందరికీ సవాలు విసిరింది. దమ్ముధైర్యం, బుద్ధిబలం ఉన్నవాళ్లు నాతో ఆడటానికి ట్రై చేయండి అని చాలెంజ్‌ చేసింది. నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా అంటూ యానీ మాస్టర్‌, విశ్వలను నామినేట్‌ చేసింది. ఈ క్రమంలో ఉమాదేవి, ప్రియాంకసింగ్‌, యానీ మాస్టర్‌ల మధ్య పెద్ద ఫైటే నడిచింది. నాకు రెస్పెక్ట్‌ అవసరం లేదు అని ఉమా తేల్చి చెప్పడంతో పింకీ.. పోవే ఉమా పో.. అని వ్యంగ్యంగా మాట్లాడింది.

సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారు, వాళ్లిద్దరూ ఫేక్‌: శ్వేత
లోబో.. టాస్క్‌ ఆడగా, పని చేయగా చూడలేదంటూ శ్వేతను నామినేట్‌ చేశాడు.  రవి తనకు టఫ్‌ కాంపిటీషన్‌ అని, అతడితో దోస్తానా వద్దని దండం పెట్టేసి యాంకర్‌కు రంగు పూశాడు. తర్వాత వచ్చిన శ్వేత ఒక్కొక్కరికీ బొమ్మ చూపించింది. అసలు రంగులు బయటపడుతున్నాయంటూ లోబో కట్టిన ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ను పడేసింది. నా లైఫ్‌లో నన్ను ఎవరూ సపోర్ట్‌ చేయలేదు. ఒక్కదాన్నే ఇక్కడి దాకా వచ్చానని ఆవేశపడింది. కాజల్‌, ప్రియ లేనప్పుడు వాళ్ల గురించి మాట్లాడావు, ఇప్పుడు మాత్రం సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నావంటూ లోబోకు ఇచ్చిపడేసింది. సెట్‌ శ్వేత లేదని ఎలా అన్నావు? అంటూ హమీదా మీద చిందులు తొక్కింది. మీరిద్దరూ ఫేక్‌ అని తిట్టిపోసింది.

ఉమాదేవి మీద ఉగ్రరూపం, చప్పట్లు కొట్టిన హౌస్‌మేట్స్‌
ఆడవాళ్లకు ఆడవాళ్లైనా గౌరవం ఇవ్వాలని ఉమాదేవి మీద మండిపడటంతో ఇంటిసభ్యులు అందరూ చప్పట్లు కొట్టారు. మిమ్మల్ని సపోర్ట్‌ చేసిన యానీ మాస్టర్‌ను అన్ని మాటలు ఎలా అనగలిగావు? అని నిలదీయడంతో మాస్టర్‌ కన్నీటిపర్యంతమైంది. అయితే ఉమా మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం. ఇక హమీదాను ఫేక్‌ అంటూ గట్టిగా ఆమె ముఖం మీద కొట్టినట్లుగా రంగు పూసింది. కళ్లలో పడుతుందని వారిస్తున్నా తనకు అనవసరం అంటూ దురుసుగా ప్రవర్తించింది. అయితే శ్వేత తను నన్ను కొట్టిందంటూ ఏడ్చేసింది హమీదా.

మీ బూతులు వినలేకపోతున్నా: షణ్ముఖ్‌
అది అక్కడున్నవాళ్లందరికీ అర్థం కాగా.. మానవత్వం గురించి మాట్లాడిన నువ్వు చేసిందేంటి? అని శ్వేతను ప్రశ్నించింది ప్రియ. దీంతో తన తప్పు అంగీకరించిన శ్వేత మోకాళ్లపై కూర్చుని హమీదాకు సారీ చెప్పింది. అమ్మాయికి క్షమాపణలు చెప్పింది కానీ తనకు మాత్రం సారీ చెప్పలేదని హర్ట్‌ అయ్యాడు లోబో. అనంతరం షణ్ముఖ్‌.. మీరు కరెక్ట్‌ కావచ్చేమోగానీ హౌస్‌కు కరెక్ట్‌ కాదేమో అనిపిస్తోంది. పైగా మీరు మాట్లాడుతున్న బూతులు వినలేకపోతున్నానంటూ ఉమాదేవిని, ఒరిజినల్‌ క్యారెక్టర్‌ను చూడాలనుకుంటున్నానని జెస్సీని నామినేట్‌ చేశాడు.

నామినేషన్‌లో ఏడుగురు
కాజల్‌.. యానీ మాస్టర్‌, విశ్వను; జెస్సీ.. విశ్వ, లోబోను; శ్రీరామచంద్ర.. నటరాజ్‌ మాస్టర్‌, వంట రాదని అబద్ధం చెప్పావంటూ కాజల్‌ను నామినేట్‌ చేశారు. దీంతో మరోసారి ఏడ్చేసింది కాజల్‌. ప్రియ.. సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నావంటూ సన్నీని, ఆ తర్వాత నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేసింది. రవి.. ప్రియాంక సింగ్‌, శ్రీరామచంద్రను నామినేట్‌ చేశాడు. నామినేషన్‌ ప్రక్రియ ముగిసే సమయానికి నక్క టీమ్‌లో నుంచి ఉమా, నటరాజ్‌, కాజల్‌, గద్ద టీమ్‌లో నుంచి లోబో, ప్రియాంక, యానీ, ప్రియ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ వెల్లడించాడు.

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)