Breaking News

అతడి ఫొటోను కాలితో తన్నిన నటరాజ్‌ మాస్టర్‌, షాక్‌లో అరియానా!

Published on Mon, 10/04/2021 - 19:04

Nataraj Master BiggBoss Telugu 5 Elimination Interview: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో నుంచి నాలుగోవారం సింహం బయటకు వచ్చేసింది. కంటెస్టెంట్లందరికీ ఒక్కో జంతువు పేరిచ్చే నటరాజ్‌ మాస్టర్‌ తనకు తాను సింహం అని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే కదా! ఈ సింహం సింగిల్‌గానే షో నుంచి ఎలిమినేట్‌ అయింది. తాజాగా మాస్టర్‌ బిగ్‌బాస్‌ బజ్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరేంటి? అనేది పూసగుచ్చినట్లుగా వివరించాడు. తనకు ఎవరి మీదైతే కోపం ఉందో ఇంటర్వ్యూలో వారి తాట తీసినట్లు కనిపిస్తోంది. అరియానా గ్లోరీ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్‌ బజ్‌ ఇంటర్వ్యూలో ఆయన ఏం మాట్లాడాడో చదివేయండి..

మొదటగా నటరాజ్‌ మాస్టర్‌ విశ్వతో పాటు మరో కంటెస్టెంట్‌ ఫొటోను కింద పడేసి కాలితో తన్నేశాడు. తన ఫ్రస్టేషన్‌ అంతా బయటపెడుతూ గట్టిగా అరవడంతో అరియానా ఒక్కసారిగా షాకైంది. తర్వాత మాస్టర్‌.. ఒక్కో కంటెస్టెంట్‌ గురించి మాట్లాడాడు. యాంకర్‌ రవి టాస్క్‌ వచ్చినప్పుడు నత్తలాగా, నామినేషన్స్‌లో గుంటనక్కలాగా ఉంటాడని చెప్పుకొచ్చాడు. శ్వేత.. బిగ్‌బాస్‌ హౌస్‌లో తనకో ప్రపంచాన్ని సృష్టించుకుందన్నాడు. ప్రియను ఫిట్టింగ్‌ మాస్టర్‌ అని పేర్కొన్నాడు. తర్వాత జెస్సీ గురించి మాట్లాడుతూ.. వీడు పిల్ల బచ్చానే కానీ, మొన్న పులిహోర కలపడానికి ప్రయత్నించగా అది పులిసిపోయింది అని నవ్వేశాడు. శ్రీరామచంద్ర ముద్దపప్పులా వచ్చాడని, అతడు యాక్ట్‌ చేస్తున్నాడని కుండ బద్ధలు కొట్టేశాడు.

'మీరు మైక్‌ ధరించండి, చెవుల్లో మాట్లాడకూడదు' అన్న హెచ్చరికలు కాజల్‌నుద్దేశించే వస్తాయని తెలిపాడు. షణ్ముఖ్‌ పరమానందయ్య శిష్యుడని, తెలివి ఉన్నప్పటికీ దాన్ని వాడట్లేదని పెదవి విరిచాడు. ఇక లోబోను పొగిడినట్లే పొగిడి అతడి గాలి తీసేశాడు నటరాజ్‌ మాస్టర్‌. బిగ్‌బాస్‌ అంత ఫుడ్‌ పంపిస్తున్నా లోబో డస్ట్‌బిన్‌లో ఆహారం వెతుక్కోవమేంటి? అని అరియానా ప్రశ్నించగా అదంతా డ్రామా అని నొక్కి చెప్పాడు నట్టూ. లోబో ఇంకా రవి ఇచ్చిన మాస్క్‌లోనే ఉన్నాడని తెలిపాడు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది.

Videos

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

73 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమ కేసులు: YS Jagan

పల్నాడు జిల్లా దాచేపల్లిలో పోలీసుల ఓవరాక్షన్

సీజ్ ది షిప్ అన్నాడు షిప్ పోయింది బియ్యం పోయాయి.. పవన్ పై జగన్ సెటైర్లు..

అక్రమ కేసులు అరెస్టులు ఏపీలో రెడ్ బుక్ బుసలు కొడుతుంది

సుమోలు, కేరళాలు.. గుడ్ ఫ్రెండ్స్ ఏందయ్యా ఈ బ్రాండ్లు..!

Photos

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)