Breaking News

ఒకరు చచ్చిపోతుంటే కూడా కాజల్‌కు అదే కావాలి: యానీ

Published on Mon, 11/22/2021 - 18:25

Bigg Boss Telugu 5, Anee Master Bigg Boss Buzz Video: బిగ్‌బాస్‌ హౌస్‌లో 11 వారాల జర్నీకి ఫుల్‌స్టాప్‌ పెట్టింది యానీ మాస్టర్‌. ఆమెను మరికొద్ది రోజులు హౌస్‌లో ఉంచేందుకు ప్రేక్షకులు విముఖత చూపించడంతో షో నుంచి ఎలిమినేట్‌ అయింది. భారంగా బిగ్‌బాస్‌ హౌస్‌కు వీడ్కోలు పలికింది. బయటకు వచ్చిన వెంటనే అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ బజ్‌లో పాల్గొంది. అరియానాకిచ్చిన ఇంటర్వ్యూలో హౌస్‌మేట్స్‌ గురించి యానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సిరి షణ్నుతో ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతుందటగా అని అరియానా అడగ్గా.. వాళ్లను చూసి అయ్యబాబోయ్‌ ఏంటీ హగ్గులు, మాకు హగ్గులు దొరకవా అనుకునేవాళ్లమని చెప్పింది యానీ.

కాజల్‌ గురించి చెప్తూ.. ఒకరు చచ్చిపోతుంటే కూడా ముందు నీ స్ట్రాటజీ ఏంటో చెప్పంటూ గుచ్చిగుచ్చి అడుగుతుందని కామెంట్‌ చేసింది. హౌస్‌లో ఇప్పటికీ నటిస్తున్నవాళ్లు ఉన్నారని, కానీ వాళ్ల పేర్లు మాత్రం బయటకు చెప్పనని దాగుడు మూతలు ఆడింది. శ్రీరామ్‌ నాలుగో వారం నుంచే తనకు సపోర్ట్‌గా ఉన్నాడని, కానీ ఆ విషయం తనకు తెలియలేదంటూ ఎమోషనల్‌ అయింది. యానీ మాస్టర్‌ కన్నింగ్‌, ఫాల్తూ గేమ్‌ ఆడుతుందంటూ ఉమాదేవి మాట్లాడిన వీడియో చూపించడంతో ఆమె కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ బజ్‌ వీడియో యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది.

Videos

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

ఏందిరయ్యా ఏంజేతున్నావ్

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ

గరం ఛాయ్ సెలబ్రేషన్స్

మాపై కక్ష ఉంటే తీర్చుకోండి.. కానీ 18వేల మంది కుటుంబాలను రోడ్డున పడేయకండి..

ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై

Big Question: అరెస్టులు తప్ప ఆధారాలు లేవు.. మద్యం కేసు మటాష్

కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను దీటుగా ఎదుర్కొందాం: YS జగన్

Photos

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)