Breaking News

నేనేదో అనుకున్నా.. పెళ్లి అంత ఈజీగా జరగలేదు: పునర్నవి

Published on Sun, 03/29/2026 - 15:20

జీవితంలో 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' అని చెప్పుకునేవి కొన్ని ఉంటాయి. అలాంటి జాబితాలో పెళ్లి మొదటి స్థానంలో ఉంటుంది. ఈ పెళ్లిని తాను సింపుల్‌గా చేసుకోవాలనుకున్నానని, కానీ రెండు కుటుంబాల కలయికతో ఎంతో ప్రత్యేకంగా జరిగిందంటోంది బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి పునర్నవి భూపాలం. మార్చి 21న ప్రియుడు, ఫోటోగ్రాఫర్‌ హేమంత్‌ వర్మను పెళ్లాడింది పునర్నవి. తాజాగా ఆ పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది.

నేనేదో అనుకున్నా..
వివాహం అంటే సింపుల్‌గా, సైలెంట్‌గా అయిపోవాలి.. అత్యంత ఆత్మీయుల మధ్యలో ఈ తంతు పూర్తయిపోవాలని ఒకప్పుడు అనుకునేదాన్ని. కానీ, ఇక్కడ మా ప్రేమ మా మనసుల్ని మాత్రమే కాదు, రెండు కుటుంబాల్ని కలిపింది. వారి ఆచారాలు, సాంప్రదాయాలు, ప్రేమానురాగాల మధ్య సాదాసీదాగా కంటే భిన్నంగా, ప్రత్యేకంగా వివాహం జరిగింది.

పెళ్లంటే ఏంటి?
అయినా కూడా నావరకు ఈ పెళ్లంటే ఏంటి? అని పదేపదే ఆలోచిస్తూనే ఉన్నాను. ఇది కేవలం ఒక ఆర్భాటం కాదు, ప్రపంచమంతా చూసేలా జీవితంలో ఒకసారి చేసుకునే వేడుక మాత్రమే కాదు, ఇది మన అంతర్గతంగా జరిగే ఒక అద్భుత అనుభవం. స్త్రీ, పురుష శక్తుల కలయిక.. శివుడు, శక్తి (అమ్మవారు) మనలోనూ, మన మధ్యలోనూ ఉన్న అనుభూతి. కొన్నిసార్లు బయట శబ్ధాలు నా గొంతుకంటే పెద్దగా అనిపించాయి. 

తెలియని ప్రశాంతత
కానీ, అతడిని చూసిన ప్రతిసారి ఏదో తెలియని ప్రశాంతత. సడన్‌గా ఆ శబ్ధం వినిపించకపోయేది. నేను చేయగలను అనుకున్నాను. అతడిని నా భాగస్వామిగా ఎంచుకుంటున్నాను అని నాకు నేను మరోసారి చెప్పుకున్నప్పుడు మనసు శాంతించింది. ఇద్దరం కలిసి నడుద్దాం.. అలాగే ఒకరికొకరం ఎదగడానికి అవకాశం ఇద్దాం. మన మధ్యలోని అనుబంధాన్ని కొనసాగిద్దాం.. ఇదే నాకు అన్నింటికన్నా ఎంతో ముఖ్యమైనది.

పెళ్లి సులభంగా జరగలేదు
సమయం వచ్చింది కాబట్టి మా పెళ్లి జరగలేదు, నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టే ఈ వేడుక జరిగింది. నేను ఊహించినంత సులభంగా ఈ పెళ్లి జరగలేదు. కానీ, ఎంతో నిజాయితీగా, అందంగా, అర్థవంతంగా వివాహం జరిగింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తెలుగు బిగ్‌బాస్‌ మూడో సీజన్‌లో పాల్గొన్న పునర్నవి.. ఉయ్యాల జంపాల, పిట్టగోడ, సైకిల్‌ వంటి పలు చిత్రాల్లో నటించింది.

చదవండి: డోర్‌ తీసి చీర మార్చుకో.. స్టార్‌ నిర్మాత చెంప చెళ్లుమనిపించా: నటి

Videos

భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..

ఇదేమన్నా తొక్కుడు బిళ్ళ అనుకున్నావా.. అమరావతి రైతులతో ఆటలా..

వచ్చేది జగనే.. నువ్వు ఏ మాత్రం భయపడకు.. పవన్ వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

ఇజ్రాయెల్ ఆకాశంలో వేల సంఖ్యలో కాకులు.. ఇది వినాశనానికి సంకేతమా?

వారణాసి, స్పిరిట్ కు సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన ధురంధర్

చంద్రబాబు సొంత జిల్లాలో TDP కి అవమానం

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)