Breaking News

చావే దిక్కనుకున్నా.. కూతురి కోసం ఆగిపోయా: లేడీ కమెడియన్‌

Published on Mon, 07/29/2024 - 16:52

ఆర్య.. లేడీ కమెడియన్‌. బడాయి బంగ్లా అనే కామెడీ షోతో తన పేరు కాస్తా ఆర్య బడాయిగా మారిపోయింది. నటిగా, హాస్య నటిగా, యాంకర్‌గా, జడ్జిగా ఇలా వివిధ పాత్రలు పోషించే ఆమె సినిమాలు, రియాలిటీ షోలతో ఫుల్‌ బిజీగా ఉంది. అందరినీ కడుపుబ్బా నవ్వించే ఆర్య జీవితంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. 2008లో ఐటీ ఇంజనీర్‌ రోహిత్‌ సుశీలన్‌ (నటి అర్చన సుశీలన్‌ సోదరుడు)ను పెళ్లాడగా వీరికి రోయ అనే కూతురు పుట్టింది. కూతురి పేరు మీద ఓ బొటిక్‌ కూడా ఓపెన్‌ చేసింది. అయితే ఏమైందో ఏమో కానీ 2019లో భర్తతో విడిపోయి కూతురితో ఒంటరిగా నివసిస్తోంది.

బిగ్‌బాస్‌ తర్వాత డిప్రెషన్‌
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధను బయటపెట్టింది. బిగ్‌బాస్‌ నుంచి వచ్చాక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడలేకపోయాను. చనిపోయేందుకు ప్రయత్నించాను. నిద్రమాత్రలు తీసుకున్నాను. కానీ నా కూతురిని చూసి ఆగిపోయాను. తనే నన్ను ఆ బాధలో నుంచి బయటపడేసింది. ఎప్పుడైనా సరే మనకు తట్టుకోలేనంత బాధ అనిపిస్తే దాన్నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తాం. చావు ఒక్కటే మార్గం అనుకుంటాం. 

మరణమే మార్గమనుకున్నా
లాక్‌డౌన్‌లో నాకూ అలాంటి పరిస్థితే ఎదురైంది. మాట్లాడేందుకు కూడా ఎవరూ లేరు. చావే సరైన నిర్ణయమనుకున్నాను. కానీ నా కూతురు.. తన పరిస్థితి ఏం కావాలి? తనను చూసుకోవడానికి మా నాన్న కూడా లేరు. ఆయన ఉండుంటే కూతుర్ని ఆయన చూసుకుంటాడన్న ధీమాతో ఎప్పుడో ప్రాణాలు వదిలేసేదాన్ని. నేను, అమ్మ, వదిన, పాప.. వాళ్లకంటూ ఉన్నది నేనేగా! అందరినీ వదిలేసిపోతే వాళ్లుం ఏం చేస్తారు? నా కూతురు జీవితం ఏమైపోతుంది? పాపను తన తండ్రి బాగానే చూసుకుంటాడు.

కూతురి కోసం ఆలోచించి ఆగిపోయా
కానీ చుట్టూ ఉన్న సమాజం ప్రేమలో ఓడిపోయి మీ అమ్మ బలవన్మరణానికి పాల్పడిందంటూ కాకుల్లా పొడిచి మరీ చెప్తారు. అవన్నీ ఆలోచించి ఆగిపోయాను. నా కుటుంబంతో, ఫ్రెండ్స్‌తో మాట్లాడాను. మళ్లీ సరైన దారిలోకి వచ్చాను. పెళ్లి విఫలమవడాన్ని భరించాను, తర్వాత బ్రేకప్‌ బాధనూ తట్టుకున్నాను, ఆఖరికి నాన్న మరణాన్ని సైతం తట్టుకుని నిలబడ్డాను. అందుకే అందరూ నన్ను బోల్డ్‌ అని పిలుస్తుంటారు. కానీ నేను చాలా ఎమోషనల్‌.. అని ఆర్య చెప్పుకొచ్చింది.

 

 

చదవండి: నటుడి ఇంట మొన్న విషాదం.. అంతలోనే సంతోషం..

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)