Breaking News

భార్యకు విడాకులిచ్చిన 'దేవి' నటుడు

Published on Thu, 12/18/2025 - 11:18

మలయాళ నటుడు, 'దేవి' సినిమా ఫేమ్‌ షిజు ఏఆర్‌ విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించాడు. 'ప్రీతి ప్రేమ్‌-నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి. దంపతులుగా విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతాం. మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. దయచేసి ఎటువంటి పుకార్లు సృష్టించకండి. ఇకపై మేము విడివిడిగా వ్యక్తిగత జీవితాన్ని గడుపుతాం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ లేఖ విడుదల చేశాడు.

లవ్‌ స్టోరీ
షిజు మలయాళంలో హీరోగా నటించిన తొలి చిత్రం 'ఇష్టమను నూరు వట్టం'. కువైట్‌లో 12వ తరగతి చదువుతున్న సమయంలో ప్రీతి ఈ సినిమా చూసింది. ఇందులోని హీరో షిజు ఆమెకు తెగ నచ్చేశాడు. కట్‌ చేస్తే కొన్నేళ్లకు ఎయిర్‌హోస్టెస్‌గా డ్యూటీ ఎక్కింది ప్రీతి. అలా ఓసారి చెన్నై ఎయిర్‌పోర్టులో షిజును కలిసింది. అప్పుడే ఇద్దరూ మాట్లాడుకోవడం.. నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం జరిగాయి. ఫ్రెండ్స్‌గా బోలెడన్ని కబుర్లు చెప్పుకునేవారు.

ఓరోజు షిజు.. ప్రీతికి ఫోన్‌ చేసి నువ్వంటే నాకిష్టం అన్నాడు. టీనేజీ నుంచి ఇష్టపడుతున్న హీరో తనను ఇష్టపడేసరికి ప్రీతికి నోటమాట రాలేదు. వారం రోజుల్లో షిజు ఆమెకు మరోసారి ప్రపోజ్‌ చేశాడు. అప్పుడు కానీ ప్రీతికి ఓ విషయం గుర్తురాలేదు. అతడు ముస్లిం, తాను క్రిస్టియన్‌ అని! కొంత సమయం కావాలని అడిగింది. ఇంట్లో అడిగితేనేమో ఇద్దరి మతాలు వేరని వ్యతిరేకించారు.

మతం కన్నా మనిషి వ్యక్తిత్వమే ముఖ్యమని భావించిన ప్రీతి ఎక్కువ ఆలస్యం చేయదల్చుకోలేదు. మూడు రోజుల్లోనే పెళ్లి చేసుకుందామంది. అలా 2008లో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. వీరికి ఓ కూతురు పుట్టింది. తర్వాత కూతురి సమక్షంలో మరోసారి సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు 17 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ విడిపోయారు.

సినిమా
మలయాళంలో అనేక సినిమాలు చేసిన షిజు (Shiju Abdul Rasheed) 'దేవి' మూవీతో తెలుగువారికి పరిచయమయ్యాడు. సింహరాశి, నువ్వు నాకు నచ్చావ్‌, మనసంతా నువ్వే, గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ, శివరామరాజు, శతమానం భవతి.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగులో చివరగా రాబిన్‌హుడ్‌ మూవీలో కనిపించాడు. మలయాళ బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొనడమే కాకుండా టాప్‌ 5లో ఒకరిగా నిలిచాడు. ప్రీతి.. ప్రస్తుతం ప్రొఫెషనల్‌ క్లాసికల్‌ డ్యాన్సర్‌గా  రాణిస్తోంది. అలాగే ఈమె లాయర్‌ కూడా!

 

 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)