Breaking News

హీరోగా ఛాన్స్‌ కొట్టేసిన 'బిగ్‌బాస్‌' అమర్‌దీప్‌.. హీరోయిన్‌ సెలక్షన్‌ అదుర్స్‌

Published on Thu, 02/01/2024 - 13:03

'జానకి కలగనలేదు' సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన అమర్‌దీప్ చౌదరి బిగ్‌ బాస్‌తో మరింత పాపులర్‌ అయ్యాడు. సీజన్‌-7లో ఆయన రన్నర్‌గా నిలిచినా ప్రేక్షకుల్లో మాత్రం చెరిగిపోని ముద్రే వేశాడని చెప్పవచ్చు. టైటిల్‌ విన్నర్‌గా ఆట బరిలోకి దిగిన అమర్‌.. గెలవాలనే తపన, కోరిక ఎక్కువగానే కనిపించినా అప్పుడప్పుడు అతనిలోని కోపం కంట్రోల్‌ తప్పడంతోనే రన్నర్‌గా మిగిలాడని చెప్పవచ్చు. బిగ్‌ బాస్‌తో వచ్చిన గుర్తింపుతో ఇప్పటికే చాలా మంది మరో అడుగు ముందుకేసి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. బిగ్‌ బాస్‌తో గుర్తింపు తెచ్చుకున్న సయ్యద్​ సోహైల్​ ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా మెప్పిస్తున్నాడు. ఫిబ్రవరి 2న బూట్‌కట్‌ బాలరాజు సినిమా కూడా విడుదల కానుంది.

తాజాగా అమర్‌దీప్ చౌదరి కూడా హీరోగా తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నాడు. ఆయన గతంలోనే  ‘ఐరావతం’ అనే సినిమాలో కనిపించిన విషయం తెలసిందే. ఇందులో ప్రముఖ మోడల్ తన్వీ నేగితో పాటు ఎస్తేర్ నొరోహా కీలక పాత్రలో కనిపించారు.  డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. అమర్‌ నుంచి మరోక సినిమా వస్తుందని అఫీషియల్‌గానే ప్రకటన వచ్చేసింది. M3 మీడియా బ్యానర్​లో మహేంద్ర నాథ్ కొండ్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో సీనియర్‌ హీరో వినోద్‌ కుమార్‌తో పాటు రాజా రవీంద్ర వంటి సీనియర్‌ నటులు నటిస్తున్నారు.

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న సుప్రీత
అమర్‌దీప్‌ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌ ఎంపిక చాలా క్రేజీగా ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్‌లో సీనియర్‌ నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి కూతురు సుప్రీత ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. వెండితెరపై అడుగుపెట్టకుండానే ఈ ‍బ్యూటీకి భారీగానే పాపులారిటీని సంపాదించుకుంది.. సుప్రీతకు హీరోయిన్‌ కావాల్సినన్ని అర్హతలు కూడా ఆమెలో ఉన్నాయని చెప్పవచ్చు. ఇన్‌స్టాలో ఈ బ్యూటీకి 8 లక్షలకు పైగానే ఫాలోవర్స్‌ ఉన్నారు. ఆమె తన అమ్మగారితో కలిసి చేస్తున్న రీల్స్‌కు సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ ఉంది.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)