Breaking News

ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!

Published on Wed, 12/25/2024 - 08:11

ఈసారి బిగ్‌బాస్ షో (Bigg Boss 8 Telugu) విజేతగా సీరియల్ నటుడు నిఖిల్ (Nikhil Maliyakkal) నిలిచాడు. గేమ్‌లో గెలవడం సంగతి పక్కనబెడితే ఇతడికో లవ్ స్టోరీ ఉంది. తనతో పాటు సీరియల్స్ చేసిన కావ్యనే ప్రేమించాడు. కొన్నాళ్లు రిలేషన్‌లో ఉన్నారు. ఏమైందో ఏమో గానీ బ్రేకప్ అయింది. ఇదంతా నిఖిల్.. బిగ్‌బాస్‌కి రాకముందే జరిగిపోయింది. షోలో ఉన్నప్పుడే నిఖిల్-కావ్య ఒకరిపై ఒకరు కౌంటర్స్ వేసుకుంటూ ఇన్ స్టాలో పోస్టులు కూడా పెట్టారు.

బిగ్ బాస్ అయిపోగానే వచ్చి కావ్యని కలుస్తానని షోలో ఉన్నప్పుడు నిఖిల్ చెప్పాడు. కానీ అలా చేయలేదు. నేరుగా కర్ణాటకలోని సొంతూరు వెళ్లిపోయారు. షోలో గెలిచిన ఆనందంలో పార్టీ చేసుకున్నారు. కానీ ఊహించని విధంగా మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య (Kavyashree) ఒకే షోలో ఎదురెదురు పడ్డారు. ఇంకా చెప్పాలంటే ఎదురు పడాల్సి వచ్చింది. కానీ కావ్య అయితే కనీసం నిఖిల్ ముఖం వైపు కూడా చూసేందుకు ఇష్టపడలేదు. షోలో నిఖిల్ ఉన్నంతసేపు చాలా సీరియస్ ఫేస్‌తో కనిపించింది.

(ఇదీ చదవండి: Allu Arjun Issue: 3.30 గంటలు.. 20 ప్రశ్నలు)

తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. దీనికే బిగ్‌బాస్ విజేత నిఖిల్ వచ్చాడు. అయితే కావ్యతో బ్రేకప్ గురించి తెలిసినా సరే హోస్ట్ శ్రీముఖి కావాలనే.. వీళ్లని పరిచయం చేస్తాను పదా అని చెప్పి కావ్య ఆడుతున్న టీమ్‌ దగ్గరకు తీసుకెళ్లింది. అయితే నిఖిల్ వైపు కనీసం చూసేందుకు కూడా కావ్య ఇష్టపడలేదు. షోలో ఉన్నంతసేపు కళ్లజోడు పెట్టుకునే నిఖిల్ కనిపించాడు. కళ్లద్దాలు తీయవా అని నిఖిల్‌ని శ్రీముఖి అడిగింది కానీ తీయను అనే సమాధానం నిఖిల్ నుంచి వచ్చింది.

నిఖిల్-కావ్యని ఎదురెదురుగా పెట్టిన శ్రీముఖి.. మాట్లాడించడానికి చాలానే ప్రయత్నించింది. కానీ కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది. కనీసం నిఖిల్‌ని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు కానీ కావ్యకి మాత్రం కన్నీళ్లు ఒక్కటే తక్కువ అన్నట్టుగా చాలా దిగులుగా కనిపించింది. తెగిపోయిన బంధం మళ్లీ అతుక్కునే ప్రసక్తే లేదు అన్నట్టుగానే కనిపించాయి కావ్య చూపులు. ప్రోమోలో అయితే కనీసం చూడలేదు. షోలో అయినా సరే వీళ్లు మాట్లాడించారా అనేది చూడాలి?

(ఇదీ చదవండి: పీవీ సింధు రిసెప్షన్‌‌లో సినీ స్టార్స్.. చిరు, అజిత్‌తో పాటు)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)