Breaking News

Bigg Boss 7 Grand Finale: అది ఫేక్‌ న్యూస్‌

Published on Sun, 12/17/2023 - 19:26

బిగ్‌బాస్‌ ఫినాలే గ్రాండ్‌గా మొదలైంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఈ ఎపిసోడ్‌ స్టార్‌ మాతో పాటు ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అయింది. దాదాపు 105 రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకుల అలరించిన సీజన్‌ 7.. నేటితో ముగియనుంది. ఉల్టా పుల్టా అంటూ వచ్చిన ఏడో సీజన్‌ గత సీజన్లకు కాస్త భిన్నంగా సాగింది. తొలుత 14 మంది.. ఐదు వారాల తర్వాత మరో 5 మంది హౌస్‌లోకి వెళ్లారు. ఈ సారి తెలిసిన ముఖాలే హౌస్‌లోకి వెళ్లడంతో.. తొలి నుంచే సీజన్‌ 7పై పాజిటివ్‌ టాక్‌ వినిపించింది. టాస్క్‌లు కూడా కొత్తగా ఉండడం.. కంటెస్టెంట్స్‌ కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడంతో సీజన్‌ 7 సూపర్‌ హిట్‌గా నిలిచింది.

మేకర్స్‌ కూడా ఈ సీజన్‌ పట్ల హ్యాపీగా ఉన్నారు. అందుకే ఫినాలేను మరింత గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు. టాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్స్‌ని ఫినాలో భాగస్వామ్యం చేశారు. రవితేజ మొదలు అల్లరి నరేశ్‌ వరకు ఫినాలే ఈవెంట్‌లో పాల్గొన్నారు. అయితే ఫినాలేకు చీఫ్‌ గెస్ట్‌గా సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు వస్తాడని గత మూడు రోజులుగా వార్తలు వినిపించాయి. మహేశ్‌ కొత్త సినిమా గుంటూరు కారం సంక్రాంతికి రిలీజ్‌ ఉండడంతో నిజంగా బిగ్‌బాస్‌ షోకి వస్తారని అంతా భావించారు.

పలు వెబ్‌సైట్లలో కూడా వార్తలు వచ్చాయి. కానీ అదంతా ఫేక్‌. ఫినాలేకు మహేశ్‌ రావడం లేదు. ఈ రోజు విడుదలైన ప్రోమోలు చూస్తే కూడా ఈ విషయం అర్థమైపోతుంది. వాస్తవానికి మహేశ్‌ బీబీ 7 ఫినాలేకు రావాల్సిందే. కానీ గుంటూరు కారం సినిమా సాంగ్‌ షూటింగ్‌ ఉండడంతో రాలేకపోయాడట. ఈ సాంగ్‌ షూటింగ్‌ అన్నపూర్ణ స్టూడియోలోనే ఉండడం.. మహేశ్‌ అక్కడికి వెళ్లడంతో అంతా ఫినాలే కోసమే వెళ్లారని భావించారు. కానీ అది ఫేక్‌ అని మహేశ్‌ సన్నిహితులు పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం హౌస్‌లో ఉన్న శివాజీ, యావర్‌, పల్లవి ప్రశాంత్‌, అర్జున్‌, ప్రియాంక, అమర్‌దీప్‌ ఉన్నారు. వీరిలో పల్లవి ప్రశాంత్‌ సీజన్‌ 7 విన్నర్‌గా నిలిచినట్లు తెలుస్తోంది. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి