Breaking News

రతిక పెట్టిన చిచ్చు.. మీదపడి మరీ అరుచుకున్న ఆ ఇ‍ద్దరు!

Published on Tue, 11/14/2023 - 23:26

అమ్మాయిల వల్ల రాజ్యాలే కుప్పకూలిపోయాయి. ఆఫ్ట్రాల్ 'బిగ్‌బాస్' ఎంత? అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. తాజాగా 11వ వారం నామినేషన్స్‌లో ఓ అమ్మాయి గతంలో అనేసిన ఓ మాట కోసం ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ గొడవపడ్డారు. మీదమీదపడి కొట్టుకునేంతవరకు వెళ్లిపోయింది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 72 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

(ఇదీ చదవండి: నటి అన్నపూర్ణ కన్నీళ్లు.. కూతురి ఆత్మహత్య విషయం గుర్తొచ్చి!)

నామినేషన్స్‌లో రచ్చరచ్చ
సోమవారం నలుగురు హౌస్‌మేట్స్ తమతమ నామినేషన్స్ పూర్తిచేశారు. మంగళవారం మిగతా కంటెస్టెంట్స్ నామినేషన్స్ కంప్లీట్ చేశారు. అయితే సోమవారం కాస్తోకూస్తో లాజిక్స్ మాట్లాడారు కానీ మంగళవారం మాత్రం చాలా సిల్లీగా అసలేం ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా సాగాయి. ఓవరాల్‌గా ఎనిమిది మంది ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు.

ఎవరు ఎవరిని నామినేట్ చేశారు?

  • ప్రశాంత్ - అర్జున్, రతిక
  • అశ్విని - ప్రియాంక, అమరదీప్
  • యవర్ - శోభాశెట్టి, అమరదీప్
  • శోభాశెట్టి - యవర్, అశ్విని
  • అమరదీప్ - గౌతమ్, యవర్
  • శివాజీ - గౌతమ్, ప్రియాంక

దొరికిపోయిన యవర్
అమరదీప్‌ని నామినేట్ చేసిన అశ్విని.. తనపై పాట పాడినందుకే చేస్తున్నానని కారణం చెప్పింది. అయితే మరీ ఇంత సిల్లీ రీజనే ఏంట్రా బాబు అనిపించింది. దీని తర్వాత వచ్చిన యవర్, అమరదీప్‌ని నామినేట్ చేశాడు. అయితే ఫస్ట్ టెడ్డీ గేమ్‌లో తన బొమ్మ ఎందుకు పట్టుకున్నావ్ అని మాట్లాడాడు. ఇది నా గేమ్ అని అమర్ క్లారిటీ ఇచ్చేసరికి యవర్ మాట మార్చేశాడు. అది కాదు నింజా గేమ్ గురించి మాట్లాడుతున్నా అన్నాడు. దీంతో అమర్ చాలా కూల్‌గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గత వారాల్లో తప్పులు ఎత్తిచూపి నామినేషన్ చేస్తున్నావ్ అంతేగా అని అమర్ అనేసరికి.. ఇ‍ప్పటివరకు జరిగింది మొత్తం చూసి చెబుతున్నా అని యవర్ అరిచాడు. బిగ్‌బాస్ నెక్స్ట్ టైమ్ నుంచి ఇలాంటి గేమ్స్ ఇవ్వకండి.. యవర్‌కి ఇవి నచ్చట్లేదు అని అమరదీప్ సెటైరికల్‌గా మాట్లాడాడు.

(ఇదీ చదవండి: స్టార్ హీరో ప్రేమ వ్యవహారం.. మోసం చేసిన క్లోజ్ ఫ్రెండ్!)

రతిక చెప్పిన దానికోసం
ఇకపోతే అమర్-యవర్ నామినేషన్స్ సందర్భంగా.. హైప్ కోసమే రతిక వెనక యవర్ తిరుగుతున్నాడని అమరదీప్ అప్పుడెప్పుడో మూడో వారామో నాలుగో వారమో అన్నాడట. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ జరగడం ఆశ్చర్యంగా అనిపించింది. ఇది ఇక్కడితో ఆగిపోయింటే పర్లేదు గానీ అమర్ రెచ్చగొట్టేసరికి యవర్ పైపైకి వచ్చాడు. మధ్యలో ఎంటరైన శివాజీ.. వాళ్లని ఆపుచేశాడు. యవర్ కావాలనే అబద్ధాలు చెబుతున్నాడని అమర్ రెచ్చిపోయాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.

ఈ వారం నామినేట్ అయినోళ్లు

  • అమరదీప్
  • శోభా
  • ప్రియాంక
  • అర్జున్
  • రతిక
  • అశ్విని
  • యవర్
  • గౌతమ్

(ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)