Breaking News

'బిగ్‌బాస్ 7'లో నయని పావని ఎలిమినేట్.. అలా జరగడం ఇదే ఫస్ట్ టైమ్!

Published on Sun, 10/15/2023 - 23:13

'బిగ్‌బాస్' షోలో ప్రతివారం ఎలిమినేషన్ కచ్చితంగా ఉంటుంది. కానీ గత ఐదువారాల కంటే ఈసారి భిన్నంగా సాగింది. అనుకోని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న నయని పావని ఎలిమినేట్ అయిపోయింది. అలానే దామిని, రతిక, శుభశ్రీ రీఎంట్రీ విషయంలో నాగ్ సరికొత్త ట్విస్ట్ పెట్టాడు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 42 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

రీఎంట్రీ కోసం పోలింగ్
ఇక దామిని, శుభశ్రీ, రతికలలో ఒకరికి ఛాన్స్ ఉందని శనివారం ఎపిసోడ్‌లో చెప్పిన నాగ్.. వాళ్ల కోసం ఓటింగ్ ప్రక్రియ మొదలు పెట్టడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభించాడు. ఇందులో భాగంగా అందరూ బ్యాలెట్ బాక్సులో వాళ్లకు అనిపించిన కంటెస్టెంట్‌కి ఓటు వేశారు. అయితే వీళ్లలో ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి కాకుండా తక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి హౌసులోకి రీఎంట్రీ ఇస్తాడని బాంబు పేల్చాడు. అది ఎవరనేది వచ్చే శనివారం చెబుతానని అన్నాడు.

(ఇదీ చదవండి: హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' రతిక)

కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ 
ఆదివారం ఎపిసోడ్ అంటే సందడి ఉంటుంది. అందుకు తగ్గట్లే ఈ వారం 'భగవంత్ కేసరి' టీమ్ నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్ శ్రీలీల వచ్చారు. కాసేపు హౌస్‌మేట్స్ అందరితో డ్యాన్సులు వేయించి, మాట్లాడి తమ చిత్రాన్ని ప్రమోట్ చేసి వెళ్లిపోయారు. ఇక ఎలిమినేషన్‪‌లో భాగంగా తేజ, యవర్ తొలి రౌండ్‌లో సేఫ్ అయ్యారు. రెండో రౌండ్‌లో అమరదీప్, శోభాశెట్టి సేఫ్ అయ్యారు. మూడో రౌండ్‌లో పూజామూర్తి సేఫ్ అయింది. చివరగా అశ్విని, నయని పావని మిగలగా.. వీళ్లిద్దరిలో అనుహ్యంగా నయని పావని ఎలిమినేట్ అయిపోయింది.

ఏడుస్తూనే ఉంది
అయితే వచ్చిన వారంలోనే ఎలిమినేట్ అయిపోవడంపై నయని పావనికి షాక్ తగిలింది. బాగా ఆడాను కానీ ఎలిమినేట్ అయిపోయానని గట్టిగా ఏడ్చేసింది. బాగా ఆడకుండా ఎలిమినేట్ అయితే ఒప్పుకుంటానని ఏడుస్తూ చెప్పింది. ఏం ఆడలేదని పంపించేస్తున్నారో అని ఏడుస్తూనే బిగ్‌బాస్‌ని ప్రశ్నించింది. ఇక నయని స్టేజీపై వెళ్లిపోయిన తర్వాత హౌసులో అందరితో ఆమె మాట్లాడుతున్నప్పుడు ప్రతిఒక్కరూ ఏడుస్తూనే ఉన్నారు. ఇన్నేళ్లలో ఇలా ఓ కంటెస్టెంట్ కోసం అందరూ కన్నీళ్లు పెట్టుకోవడం ఇదే మొదటిసారి అని స్వయంగా హౌస్ట్ నాగార్జునే అన్నాడు. ఇంతమంది మనసు గెలుచుకున్న ఈ అమ్మాయి జీవితంలో చాలా పైకొస్తుందని నాగ్ ఆశీర్వదించాడు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది.

(ఇదీ చదవండి: గుడ్డిగా నమ్మేశా.. లవర్ మోసం చేశాడు: యంగ్ హీరోయిన్)

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)