Breaking News

చిన్నపిల్లాడిలా ఏడ్చిన తేజ, అమ్మ అనారోగ్యంతో ఉందంటూ సందీప్‌..

Published on Thu, 10/05/2023 - 12:55

బిగ్‌బాస్‌ గ్యారేజ్‌.. ఇచట అన్నిరకాల మనుషులు ఉంటారు. కోపిష్టిలు, సహనశీలులు, ఆవేశపరులు, ఆలోచనాపరులు, శక్తిమంతులు, బుద్ధిహీనులు, సహృదయులు, కఠినాత్ములు.. ఇలా భిన్నరకాల మనుషులుంటారు. హౌస్‌లోకి వచ్చేటప్పుడు ఎలా ఉన్నా బయటకు వెళ్లేటప్పుడు మాత్రం ఎంతో కొంత నేర్చుకునే వెళ్తారు. ప్రస్తుత సీజన్‌లో ఇంటిసభ్యుల మధ్య ఆప్యాయత కన్నా కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. టాస్కుల్లో తెగ కష్టపడుతున్న కంటెస్టెంట్లకు బిగ్‌బాస్‌ ఈరోజు గుడ్‌న్యూస్‌, బ్యాడ్‌ న్యూస్‌ చెప్పనున్నట్లు కనిపిస్తోంది.

ఈమేరకు తాజాగా ప్రోమో విడుదలైంది. ఇందులో బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లకు వారి ఇంటిసభ్యులు పంపించిన ఉత్తరాలు చేతికందించారు. కానీ ఇప్పటికే కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంట్లో ఉన్నవారంతా జోడీ కట్టిన సంగతి తెలిసిందే కదా! ఈ జోడీలో ఒకరు త్యాగం చేస్తే మరొకరు ఉత్తరం చదువుకోవాల్సి ఉంటుంది.  దీంతో కంటెస్టెంట్లు ఎమోషనలయ్యారు. చేతిదాకా వచ్చిన ఉత్తరాన్ని చదువుకునే భాగ్యం కూడా దక్కకుండా పోయిందేనని కొందరు ఏడ్చేశారు.

ఇక సందీప్‌..  తన తల్లి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని.. తనకు ఈ ఉత్తరం ఎంతో అవసరమని చెప్తాడు. మదర్‌ సెంటిమెంట్‌ అయ్యేసరికి అమర్‌ తనతో వాదించలేకపోతాడు. అటు శుభశ్రీ సైతం తనకు ఈ లెటర్‌ కావాలని ఏడ్చేసింది. ఎప్పుడూ నవ్వించే తేజ కూడా ఉత్తరాన్ని చేతిలోకి తీసుకోగానే బోరుమని విలపించాడు. మరి ఎవరెవరికి ఉత్తరం చదివే ఛాన్స్‌ వచ్చింది? ఎవరు తమ లెటర్‌ను చింపేసి త్యాగానికి సిద్ధపడ్డారు? అనేది తెలియాలంటే నేటి ఎమోషనల్‌ ఎపిసోడ్‌ చూడాల్సిందే!

చదవండి: బిగ్‌ బాస్‌ ఇంట్లో తప్పిన బ్యాలెన్స్.. రీ ఎంట్రీ ఇస్తున్న రతిక?

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)