Breaking News

వెనకాల గోతులు తవ్వుతోంది.. అమర్‌ వీడియో చూసి షాకైన శోభ

Published on Mon, 12/11/2023 - 14:11

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఆదివారం నాడు శోభా శెట్టి ఎలిమినేట్‌ అయింది. తన ఎలిమినేషన్‌ను జనాలే కాదు శోభా కూడా పసిగట్టేసింది. అందుకే ఏదైతే అదైందని గతవారం హౌస్‌లో విశ్వరూపం చూపించింది. అందరి మీదా అరిచేసింది. కావాలని గొడవపెట్టుకుంది. ఇతరుల్ని రెచ్చగొట్టింది. చివరకు ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చేసింది. తాజాగా ఆమె బిగ్‌బాస్‌ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా గీతూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. మీరు హౌస్‌లో ప్రిన్స్‌ యావర్‌ సహా పలువురిని టార్గెట్‌ చేశారనిపించింది.. నిజమేనా? అని గీతూ అడగ్గా.. గేమ్‌ను టార్గెట్‌ చేశానే తప్ప ఎవరినీ టార్గెట్‌ చేయలేదని వివరణ ఇచ్చింది.

తేజ కోసం బిగ్‌బాస్‌కు రాలే..
తేజ నువ్వు లేకుండా ఉండలేనన్న మీరు అతడు వెళ్లిపోయాక ఒక్కసారి కూడా తల్చుకోలేదేంటి? అని అడిగింది గీతూ.. దీనికి శోభా స్పందిస్తూ.. తేజ కోసం బిగ్‌బాస్‌ హౌస్‌కు రాలేదు, తేజని తల్చుకుని ఏడుస్తూ సింపతీ రావాలనుకోలేదని క్లారిటీ ఇచ్చింది. శోభా ఇంకా మాట్లాడుతూ.. అమర్‌, అర్జున్‌.. ఇద్దరికీ సపోర్ట్‌ చేస్తాను. ప్రియాంక నా స్నేహితురాలైనా సపోర్ట్‌ చేయను. ఎందుకంటే అమర్‌ గెలవాలని ఎక్కువగా ఉంది. శివాజీ స్ట్రాటజీతో ఆడుతున్నాడు. మైండ్‌ గేమ్‌ ఆడుతున్నాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండాలంటే మెంటల్‌ గేమ్‌ ఆడటం చాలా అవసరం.. అది శివాజీ గ్రిప్‌లో పెట్టుకున్నాడు. జనాలకు ఏది చేస్తే నచ్చుతుంది అనేది ఆలోచించి మరీ ఆడుతున్నాడు. ఇలా ఆడితే ఏకంగా విన్నర్‌ అయిపోవచ్చు.

అమర్‌ మాటలు విని షాక్‌
అమర్‌.. శోభ గురించి మాట్లాడిన వీడియో చూపించింది గీతూ. 'శోభ బ్యాక్‌బిచింగ్‌ చేస్తుంది. స్వార్థం ఎక్కువైపోయింది.. అంత స్వార్థంగా ఆలోచించేవారు గేమ్‌లో ముందుకు వెళ్లలేరు' అని మాట్లాడాడు.. ఇది చూసి షాకైన శోభ.. 'ఇది నాకు తెలియలేదు, హౌస్‌లో ఈ వీడియో చూపించాల్సింది' అని అభిప్రాయపడింది. ఇక చాలామటుకు గీతూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు దాటవేసింది శోభ.

చదవండి: బంగారు తల్లీ.. నిన్ను కలిసేవరకు నాకీ శోకం తప్పదు.. విజయ్‌ ఆంటోని భార్య ఎమోషనల్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)