Breaking News

Big Boss 7: ఎలిమినేట్ అయిన భోలె.. ఎంత సంపాదించాడో తెలుసా?

Published on Sun, 11/12/2023 - 23:21

బిగ్‌బాస్ 7లో ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పడం కష్టం. ఆదివారం ఎపిసోడ్‌తో పదోవారం ముగిసింది. గత తొమ్మిది వారాల్లో తొమ్మిది మంది హౌస్ నుంచి బయటకెళ్లిపోగా.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని చిన్న టెన్షన్ నడిచింది. అయితే అందరూ రతిక ఎలిమినేట్ అవుతుందేమో అనుకున్నారు. కానీ అనుహ్యంగా భోలె ఎలిమినేట్ అయిపోయాడు. పాడ పాడుతూ, నవ్వుకుంటూ హౌస్ నుంచి బయటకొచ్చేశాడు.

భోలె ఎలిమినేట్
ఈ వారం ఎలిమినేషన్.. రాజమాతలు అనే కాన్సెప్ట్ ప్రకారం జరిగింది. దీంతో అమ్మాయిలందరూ రాజమాతల్లా ఉండి ఎవరూ నామినేట్ కావాలనేది డిసైడ్ చేశారు. అలా శివాజీ, గౌతమ్, యవర్, భోలె, రతిక.. ఎలిమినేషన్స్‌లో నిలిచారు. ఇందులో ఎప్పటిలానే శివాజీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. తర్వాతి స్థానాల్లో యవర్, గౌతమ్ నిలిచారు. చివరి రెండు స్థానాల్లో రతిక-భోలె మధ్య కాస్త నడిచింది. కానీ భోలెపై వేటు పడింది. మరో ఛాన్స్ లేదు కాబట్టి ఎలిమినేట్ అయిపోయాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: లవ్‌స్టోరీ అంతా బయటపెట్టిన శోభా.. ఈ సీజన్‌ టాప్-5 వాళ్లే!?)

సంపాదన గట్టిగానే
వైల్డ్‌కార్డ్ కోటాలో పాటబిడ్డ అనే ట్యాగుతో హౌసులోకి ఎంట్రీ ఇచ్చిన భోలె.. ఆట కంటే పాటతో బాగా ఫేమస్ అయ్యాడు. కానీ గేమ్ విషయంలో మాత్రం చాలా వెనకబడిపోయాడు. శివాజీ బ్యాచులో ఉండటం, కాస్త ఎంటర్‌టైన్ చేయడంతో దాదాపు ఐదు వారాలు ఎలాగోలా బండి లాక్కుంటూ వచ్చేశాడు. అలానే అమ్మాయిలతో గొడవ, బూతులు మాట్లాడటం లాంటివి కాస్త మైనస్ అయ్యాయని చెప్పొచ్చు. ఈసారి ఎలిమినేషన్స్‌లోనూ అందరూ మనోడి కంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉండేసరికి భోలెపై వేటు తప్పలేదు.

ఇకపోతే భోలె.. రోజుకు రూ.35 వేల చొప్పున అంటే వారానికి దాదాపు రూ.2.5 లక్షల లెక్క రెమ్యునరేషన్ అందుకున్నాడట. అలా లెక్కేసుకుంటే ఐదు వారాలకుగానూ రూ.12 లక్షల వరకు సంపాదించాడని తెలుస్తోంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్‌లో ఇప్పటివరకు భోలెనే కాస్త ఎక్కువ మొత్తంలో అందుకున్నట్లు లెక్క. ఏదైతేనేం మనోడు వచ్చిన తొలివారంలో చెప్పినట్లు ఉన్నన్ని రోజులు మంచిగా ఉన్నాడు. మంచిగా సంపాదించి, కాస్త పేరు తెచ్చుకుని హౌస్ నుంచి వెళ్లిపోయాడు.

(ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' కంటెస్టెంట్)

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)