Breaking News

Bigg Boss 7: ఆ కారణంతో గౌతమ్‌ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?

Published on Sun, 12/03/2023 - 22:46

బిగ్‌బాస్ 7 నుంచి డాక్టర్‌బాబు ఎలిమినేట్ అయిపోయాడు. అశ్వద్ధామ 2.0 అని హడావుడి చేసిన ఇతడు.. సింగిల్‌గా ఆడుతూనే 13వ వారం వరకు నెట్టుకొచ్చేశాడు. అయితే ఇతడు చేసిన కొన్ని పనులు, అలానే హౌసులోని పలువురి వల్ల గౌతమ్.. బయటకొచ్చేసినట్లు అనిపిస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే.. ఇన్నివారాలకు కలిపి రెమ్యునరేషన్ మాత్రం గట్టిగా ముట్టినట్లు టాక్. ఇంతకీ ఏంటి విషయం?

డాక్టర్‌బాబు ఫెర్ఫార్మెన్స్ ఓకే
డాక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్‌ కృష్ణ.. బిగ్‌బాస్ హౌస్‌లో 13వ వారాలైతే ఉన్నాడు గానీ గుర్తింపు అయితే పెద్దగా తెచ్చుకోలేకపోయాడు. మొదటి వారం నుంచి ఇప్పటివరకు దాదాపు ఒంటరిగానే పోరాడుతూ వచ్చారు. ఈ విషయంలో మాత్రం అతడిని మెచ్చుకోవచ్చు. ఇన్ని వారాలు జరిగిన గేమ్స్‌లోనూ గౌతమ్ గెలిచిన దాఖలాలు అయితే లేవు. ఓ రోజు సీక్రెట్ రూంలో ఉండొచ్చి, 'అశ్వద్ధామ 2.0' అని హడావుడి చేశాడు గానీ అది పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. 

(ఇదీ చదవండి: హనీమూన్‌కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?)

ఎలిమినేషన్‌కి అదే కారణమా?
ప్రారంభంలో నామమాత్రంగా ఆడిన గౌతమ్.. ఆ తర్వాత నుంచి శివాజీతో గొడవ పెట్టుకుని హైలైట్ అయ్యాడు. అప్పటి నుంచి తాజా వీకెండ్ ఎపిసోడ్ వరకు ఈ తంతే నడిచింది. అయితే శివాజీ వరస్ట్ కామందు తరహా ప్రవర్తన గురించి కాస్తో కూస్తో నిజాలు మాట్లాడిన వాళ్లలో గౌతమ్ ఒకడు. ఇదే ఇప్పుడు బిగ్‌బాస్ ఆర్గనైజర్స్‌కి నచ్చలేదు. గౌతమ్‌ని ఎలిమినేట్ చేసి పడేశారు. గత రెండు మూడు వారాల గేమ్ తీసుకుంటే శివాజీ, యావర్ కంటే గౌతమ్ చాలా బెటర్. కానీ శివాజీ మీద బిగ్‌బాసోళ్లకు ప్రేమ ఎక్కువైంది. అదే గౌతమ్‌కి శాపమైందని టాక్.

రెమ్యునరేషన్ ఎంత?
ఇకపోతే వారానికి రూ 1.5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అని గౌతమ్ డీల్ మాట్లాడుకున్నాడట. అంటే 13 వారాలకు గానూ దాదాపు రూ 19.5 లక్షలు పారితోషికంగా అందుకున్నాడని సమాచారం. అయితే ఈ విషయంపై గౌతమ్ క్లారిటీ ఇస్తే తప్ప అసలు లెక్కలు తెలియవు. ఏదేమైనా శివాజీతో పెట్టుకోవడం తనకు ప్లస్ అవుతుందని గౌతమ్ అనుకున్నాడు కానీ అదే మైనస్ అయి, ఇంటి నుంచి బయటకొచ్చేలా చేసినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: రానా తమ్ముడి డెస్టినేషన్ వెడ్డింగ్? ఆ దేశంలో మూడు రోజుల పాటు!)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)