Breaking News

తండ్రి అయిన ‘బిగ్‌బాస్‌’ అర్జున్‌.. ఏం పేరు పెట్టారంటే..?

Published on Tue, 01/09/2024 - 13:43

బిగ్‌బాస్‌ 7 కంటెస్టెంట్‌ అర్జున్‌ అంబటి తండ్రి అయ్యాడు. అర్జున్‌ భార్య సురేఖ ఈ రోజు (జనవరి 9) పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన కూతురుకి ఆర్ఖా అని నామకరణం చేశాడు. కూతురు పుట్టినా, కొడుకు పుట్టినా ఈ పేరునే పెట్టుకుంటానని బిగ్‌బాస్‌ హౌస్‌లోనే చెప్పాడు అర్జున్‌.  తన పేరులోని ఆర్‌.. సురేఖ పేరులో నుంచి ఖ తీసుకొని అర్ఖా అని పేరు ఫిక్స్‌ చేసినట్లు ఓ వీకెండ్‌ ఎపిసోడ్‌లో చెప్పాడు.  అయితే తనకు మాత్రం కూతురు పుట్టాలనే ఉందని చెప్పాడు. అనుకున్నట్లే అర్జున్‌కి కూతురే పుట్టింది. దీంతో అర్జున్‌ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి.

అర్జున్‌-సురేఖ దంపతులకు  సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, పలు సీరియళ్లలో హీరోగా నటించిన అర్జున్‌.. బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌లో పాల్గొని తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. షో ప్రారంభమైన ఐదు వారాల తర్వాత అర్జున్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనితో పాటు వైల్డ్‌ కార్డ్‌  ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు త్వరగానే ఎలిమినేట్‌ అయ్యారు. కానీ అర్జున్‌ మాత్రం చివరి వరకు ఉన్నాడు. ఫినాలే రోజు టాప్‌ 6 ప్లేస్‌లో నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. ప్రస్తుతం బుల్లితెరపై షోలు, సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు