Breaking News

బిగ్‌బాస్‌: కర్వా చౌత్‌ సెలబ్రేట్‌ చేసుకున్న దంపతులు

Published on Fri, 10/14/2022 - 23:51

Bigg Boss Telugu 6, Episode 41: బిగ్‌బాస్‌ షోలో ప్రస్తుతం కెప్టెన్సీ కోసం పోటీ నడుస్తోంది. ఈపాటికే కెప్టెన్సీ కంటెండర్ల పోటీ ముగిసింది. అయితే ఈ కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో సుదీప బంతి తీసుకుని తన బాస్కెట్‌లో కాకుండా రోహిత్‌ బాస్కెట్‌లో వేసింది. దీంతో అతడు కెప్టెన్‌ బరిలో నిలిచాడు. తన గేమ్‌ తను ఆడకుండా వేరొకరికి ఎందుకు సపోర్ట్‌ చేయడమని ఫైమా, కీర్తి.. సుదీపపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో తన ఫ్రెండ్స్‌ అయిన ఇనయ, సూర్య తనకు సాయం చేసేందుకు ముందుకు రాలేదని బాధపడింది ఫైమా.

అనంతరం రేవంత్‌, శ్రీసత్య, ఆదిరెడ్డి, రాజ్‌, అర్జున్‌, రోహిత్‌, సూర్య, వసంతిలకు బిగ్‌బాస్‌ 'ఆఖరి వరకు ఆగని పరుగు' అనే కెప్టెన్సీ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో పూలకుండీల మీద కంటెండర్ల ఫొటోలు అతికించి ఉంటాయి. బజర్‌ మోగినప్పుడు పోటీదారులు వారి పూలకుండీ కాకుండా ఇతరులది ఏదైనా పూలకుండీ తీసుకుని కంటెండర్‌ జోన్‌లోకి వెళ్లాలి. చివరగా కంటెండర్‌ జోన్‌లోకి వెళ్లిన పోటీదారుతోపాటు, అతడి చేతిలో ఏ సభ్యుడి పూలకుండీ ఉంటుందో.. ఆ ఇద్దరిలో నుంచి ఒకరిని కెప్టెన్సీ రేస్‌ నుంచి తొలగించే బాధ్యత ఇంటిసభ్యులకు అప్పగించాడు బిగ్‌బాస్‌. 

మొదటి రౌండ్‌లో రాజ్‌ తన పూలకుండీ తానే తెచ్చుకోవడంతో పోటీలో అనర్హుడయ్యాడు. తర్వాత వసంతి, రేవంత్‌, అర్జున్‌, శ్రీసత్య, ఆది రెడ్డి వరుసగా గేమ్‌లో నుంచి వైదొలిగారు. చివరగా పోటీలో సూర్య, రోహిత్‌ మిగిలారు. మెజారిటీ ఇంటిసభ్యులతో పాటు మెరీనా కూడా సూర్యకే ఓటేసింది. చివరగా ఇనయకు ఓటేసే వంతు రాగా నా ఓటు అన్నయ్యకా? బావకా? అని మెలికలు తిరిగింది. అయినా అందరూ ఊహించినట్లుగానే సూర్యకే మద్దతిచ్చింది. ఫైనల్‌గా ఈ వారం సూర్య కెప్టెన్‌గా అవతరించాడు. అనంతరం రాత్రిపూట కర్వా చౌత్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు మెరీనా- రోహిత్‌. సాంప్రదాయ దుస్తులు ధరించిన మెరీనా జల్లెడలో చంద్రుడిని చూసి, ఆ వెంటనే తన భర్త రోహిత్‌ను చూసింది. అనంతరం భర్త పాదాలు తాకి అతడి ఆశీర్వాదం తీసుకుంది. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ ఓ సాంగ్‌ ప్లే చేయడంతో ఇంటిసభ్యులంతా చిందులేశారు.

చదవండి: కాంతార సెన్సేషన్‌.. ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2లను దాటేసింది..
ఇంత ద్వేషం చూపిస్తూ అతడు చచ్చిపోతాడు: నటి

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)