Breaking News

Bigg Boss 6: నిందలు తట్టుకోలేక బాత్రూంలోకి ఇనయా.. రంగంలోకి బిగ్‌బాస్‌

Published on Wed, 11/02/2022 - 09:09

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రస్తుతం 9వ వారం జరుగుతుంది. ఈ వారం ఎలిమినేషన్‌లో హౌస్‌మేట్స్‌ అంతా ఇనయాను టార్గెట్‌ చేశారు. ఆమె పర్సనల్‌ విషయాలను ప్రస్తావిస్తూ హేళన చేశారు. ముఖ్యంగా సూర్య విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. దీంతో ఇనయా మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తుంది. నామినేషన్స్‌ పూర్తవ్వగానే బాత్‌ రూమ్‌లోకి వెళ్లి బోరున ఏడ్చింది. చాలా గిల్టీగా ఉంది బిగ్‌బాస్‌.. నా వల్ల కావడం లేదు అంటూ వెక్కివెక్కి ఏడ్చింది. దీంతో హౌస్‌మేట్స్‌ అంతా వాష్‌రూమ్‌ దగ్గరకు వెళ్లి బయటకు రావాలని కోరారు. తాను బయటకు రాలేనని, ఒక్కసారి బిగ్‌బాస్‌తో మాట్లాడాలని ఇనయా డిమాండ్‌ చేసింది. అయితే బిగ్‌బాస్‌ నుంచి ఎలాంటి ఆదేశం రాకపోవడంతో.. రేవంత్‌ వాష్‌రూం డోర్‌ని పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. అప్పుడు బిగ్‌బాస్‌ నుంచి ఇనయాకు పిలుపు వచ్చింది.

కన్ఫేషన్ రూంలోకి వెళ్లిన ఇనయా.. తన బాధనంతా బిగ్‌బాస్‌తో చెప్పుకుంది. ‘నా లైఫ్‌లో చాలా గిల్ట్స్‌ తీసుకున్నాను. ఇప్పుడు వీళ్లు వేసే నిందలు భరించలేకపోతున్నాను. నా వల్లనే సూర్య వెళ్లిపోయాడు అనడాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. నాకు ఇక్కడ ఉండాలని లేదు.నాకు నచ్చిన వాళ్లంతా నా నుంచి దూరమవుతుంటారు’అంటూ వెక్కివెక్కి ఏడ్చింది.

అప్పుడు బిగ్‌బాస్‌ ఇనయాను ఓదారుస్తూ..  ‘ఈ హౌస్‌లోకి రావడం.. వెళ్లిపోవడం అనేది ఆటలో ఒక భాగం.ఇక్కడికి రావడం మాత్రమే ఆటగాళ్ల చేతిలో ఉంటుంది. బయటకు వెళ్లడం అనేది ప్రేక్షకులు తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే మీరు మీ జీవితంలో చాలా చూశారు. నవ్వుతూ ఉండే ఒక అమ్మాయిగా ఈ ఇంట్లోకి వచ్చిన ఇనయాని..తనకు బాగా దగ్గరైన వాళ్లు ఇలా చూడాలని మీరు అనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. లేదు బిగ్‌బాస్‌ అని ఇనయా చెప్పింది. మీరు మీ కన్నీళ్లును తూడ్చుకొని బయటకు వెళ్లండి అని బిగ్‌బాస్‌ చెప్పడంతో ఇనయా నవ్వుతూ బయటకు వచ్చేసింది. 

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)