Breaking News

బిగ్ బాస్ 6 ఫస్ట్ గ్లింప్స్: బిగ్‌బాస్‌ కొత్త ఇంటిని చూశారా? అదిరిపోయింది!

Published on Thu, 09/01/2022 - 11:13

బుల్లితెరపై సందడి చేసేందుకు బిగ్‌బాస్‌ రెడీ అవుతున్నారు. తెలుగులో ఐదు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్‌ రియాల్టీ షో ఆరో సీజన్‌ సెప్టెంబర్‌ 4న ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్లను క్వారంటైన్‌కి తరలించారు. ఈ సారి హౌస్‌లోకి మొత్తం 19 మంది వెళ్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా 15 మంది కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపనున్నారట. ఆ తర్వాత మరో నలుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపించనున్నట్లు వినికిడి.

ఇప్పటికే బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈసారి ఫేమస్ సెలబ్రెటీలు, బుల్లితెర నటీనటులు, సింగర్స్‏తోపాటు ఓ సామాన్యుడు కూడా వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. చలాకీ చంటి, యాంకర్ ఆరోహి, రీతూ చౌదరి, గలాట గీతూ, సింగర్‌ రేవంత్‌, అర్జున్ కళ్యాణ్, నువ్వు నాకు నచ్చావ్ సుదీప, నటుడు శ్రీహాన్‌,  బుల్లితెర దంపతులు రోహిత్‌-మెరీనా అబ్రహం ఇలా ఎంతో మంది పేర్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

ఇదిలా ఉంది ఈ సారి బిగ్‌బాస్‌ ఇంటిని గత సీజన్లకు భిన్నంగా, మరింత అందంగా ముస్తాబుచేశారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్‌ గింప్స్‌లో ఇంటిని చూపించారు. అంతేకాదు.. అందులో పాల్గొనే కంటెస్టెంట్స్‌ ఎంట్రీని, వారి ఫెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన కొన్ని విజువల్స్‌ని చూపించారు. ఈ ఆదివారం బిగ్‌బాస్‌ షో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

Videos

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

ప్లాప్ సినిమాకు ఎందుకంత బిల్డప్ : Perni Nani

జగన్ హయాంలో స్కాం జరగలేదని స్పష్టంగా తెలుస్తుంది: పోతిన మహేష్

తెలంగాణలో అసలైన పొలిటికల్ దెయ్యం ఎవరు..?

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

Photos

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)