Breaking News

హీరో రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో బిగ్‌ ట్విస్ట్‌!

Published on Thu, 07/11/2024 - 11:09

టాలీవుడ్‌ హీరో రాజ్‌తరుణ్‌-లావణ్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్‌తరుణ్‌తో పాటు హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్‌ మల్హోత్రాపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్‌తరుణ్‌ను ఏ1గా, మాల్వీని ఏ2గా, మయాంక్‌ని ఏ3గా చేరుస్తూ నార్సింగి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఐపీసీ 420,493,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినుట్ల పోలీసులు తెలిపారు.

లావణ్యకు అబార్షన్‌
ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని కోకపేటకు చెందిన లావణ్య అనే యువతి జులై 5న నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే ఆధారాలు చూపించాలని నార్సింగి పోలీసులు ఆమెకు నోటీసులు పంపారు. దీంతో లావణ్య తన దగ్గర ఉన్న ఆధారాలన్ని పోలీసులు అందించింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెల్లడించింది. రాజ్‌తరుణ్‌తో తనకు 2008లో పరిచయం ఏర్పడిందని, 2014లో పెళ్లి  కూడా చేసుకున్నామని తెలిపింది. అతను ఆర్థిక సమస్యలతో బాధపడినప్పుడు తన కుటుంబం అదుకుందని, ఇప్పటి వరకు మొత్తంగా రూ. 70 లక్షల వరకు ఇచ్చామని చెప్పింది. అంతేకాదు 2016లో తాను గర్భం దాల్చానని.. రాజ్‌తరుణే అబార్షన్‌ చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది.

డ్రగ్స్‌ కేసులో ఇరికించారు
రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రా కలిసి తనను డ్రగ్స్‌ కేసులో ఇరికించారని లావణ్య ఆరోపించింది. ‘జనవరిలో నేను యూఎస్‌ నుంచి తిరిగి వచ్చాను. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నన్ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాపై డ్రగ్స్‌ కేసు ఉందంటూ తప్పుడు ఆరోపణలతో రిమాండ్‌ చేశారు. 45 రోజుల పాటు నేను జైలులో ఉన్నాను. రాజ్‌తరుణ్‌, మాల్వి కలిసే ఇదంతా ప్లాన్‌ చేశారు. బయటకు వచ్చాక ప్రశ్నిస్తే.. చంపేస్తామని బెదిరించారు’ అని లావణ్య ఆరోపించింది.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు