'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!

Published on Tue, 08/15/2023 - 15:48

మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజుకే టాక్ తేడా కొట్టేసింది. దీంతో రకరకాల విషయాలు బయటకొచ్చాయి. అలానే చిరు రెమ్యునరేషన్ గొడవ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే నిర్మాత వాట్సాప్ చాట్ అంటూ ఓ ఫొటో తెగ సర్క్యూలేట్ అయింది. ఇప్పుడు ఈ విషయాలన్నింటిపై నిర్మాణ సంస్థ స్వయంగా క్లారిటీ ఇచ్చింది.

ఏం జరిగింది?
మెహర్ రమేశ్  దర్శకత్వంలో చిరు 'భోళా శంకర్' చేశారు. ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర దాదాపు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే రిలీజ్‌కి ముందే పలు సమస్యలు ఎదురయ్యాయి. పలు ఏరియాల్లో బయ్యర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో నిర్మాతనే స్వయంగా రిలీజ్ చేశారు. మరోవైపు ఈ మూవీ కోసం చిరుకు ఏకంగా రూ.65 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలని అనుకున్నారట. అందులో కొంత ముందు ఇచ్చారట. 

(ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు)

అవన్నీ రూమర్స్
మిగిలిన మొత్తం ఇచ్చేందుకు నిర్మాత అనిల్ సుంకర దగ్గర డబ్బుల్లేక తన ఆస్తులు తాకట్టు పెట్టారని ఓ వార్త బయటకొచ్చింది. అలానే హీరో-నిర్మాత మధ్య ఈ విషయమై మనస్పర్థలు వచ్చినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటన్నింటిపై స్వయంగా నిర్మాణ సంస్థ స్పందించింది. అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అని కొట్టిపారేసింది. 

ట్వీట్‌తో క్లారిటీ
'సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ బేస్‌లెస్, సెన్స్‌లెస్ మాటలు. వాటిలో ఒక్కశాతం కూడా నిజం లేదు. దయచేసి ఇలాంటి వార్తల్ని నమ్మొద్దు. అనవసర డిస్కషన్స్ పెట్టొద్దని కోరుతున్నాం' అని ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్ ట్వీట్ చేసింది. బయటకు ఇలా చెబుతున్నారు గానీ లోలోపల ఏమైనా ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయా అనే డౌట్ వస్తుంది!

(ఇదీ చదవండి: స్టార్ హీరో.. ఇన్నాళ్లకు భారతీయుడు అయ్యాడు!)

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)