Bhargavi Nilayam Review: ఓ దెయ్యం పరిష్కరించుకున్న కథ!

Published on Sat, 09/14/2024 - 11:16

ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘నీల వెళిచ్చమ్‌’(Neelavelicham) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

ఎక్కడైనా ప్రేమ కథలు చూస్తాం లేదంటే హారర్‌ కథలు చూస్తాం. కానీ ‘భార్గవి నిలయం’ (1964) హారర్‌ ప్రేమ కథా చిత్రమని చెప్పవచ్చు. ఎ. విన్సెంట్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ మలయాళ సినిమాని రీమేక్‌ చేసి ‘నీల వెళిచ్చమ్‌’గా మన ముందు నిలిపారు దర్శకుడు ఆషిక్‌ అబు. 

ఈ చిత్రం కథాంశానికొస్తే... ఓ కథా రచయిత మారుమూల గ్రామంలోని ఓ భవంతిలోకి రావడంతో సినిమా మొదలవుతుంది. అదే భార్గవి నిలయం. ఆ ఊళ్లోని వారందరూ ఆ భవంతిలో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, ఆ అమ్మాయి ఆత్మ ఆ భవంతిలో తిరుగుతుందని భయపడుతూ ఎవరూ అటు వైపు వెళ్లడానికి కూడా సాహసించరు. కానీ ఈ రచయిత ధైర్యంగా ఆ భవంతిలోకి అడుగుపెట్టి ఆ దెయ్యం కథ రాయాలనుకుంటాడు. 

(చదవండి:  మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)

భార్గవి నిలయంలో అడుగుపెట్టిన రచయితకు దెయ్యం కనబడిందా? కనబడిన దెయ్యం తన కథ చెప్పిందా? అలాగే ఆ ఆత్మ తన కథలోని సమస్యను ఎలా పరిష్కరించుకోగలిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఓ రకంగా చెప్పాలంటే ఇదో వింటేజ్‌ కథ. సినిమా స్క్రీన్‌ప్లే కొంత ల్యాగ్‌లో నడిచినా చూసే ప్రేక్షకుడిని మాత్రం రీ రికార్డింగ్, అద్భుతమైన సంగీతంతో కొంతవరకు ఆకట్టుకుంటుంది. 

కొంత ‘చంద్రముఖి’ సినిమా ఛాయలు కనబడినా చివరకు ఓ మంచి సినిమా చూశామన్న అనుభూతి కలుగుతుంది. టొవినో థామస్‌ హీరోగా నటించారు. ఈ చిత్ర కథానాయకుడు సినిమాలో భార్గవి బంగారం అని దెయ్యాన్ని ప్రేమగా పిలుస్తున్నప్పుడల్లా ప్రేక్షకుడికి ప్రేమానుభూతి కలుగుతుందన్న విషయంలో అతిశయోక్తి లేదు. తెలుగులో ‘భార్గవి నిలయం’గా అనువాదం అయి, ‘ఆహా ఓటీటీ’లో స్ట్రీమ్‌ అవుతున్న ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు.
– ఇంటూరు హరికృష్ణ 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)