Breaking News

శ్రీ విష్ణు మూవీ వాయిదా, కొత్త రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మేకర్స్‌

Published on Fri, 04/29/2022 - 16:15

యంగ్ హీరో శ్రీ విష్ణు ఎంచుకునే క‌థ‌లే కాదు, ఆయ‌న న‌టించే సినిమాల టైటిల్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. మ‌రీ ముఖ్యంగా తెలుగులో టైటిల్స్ పెట్టేందుకు ఆయ‌న ఎక్కువ‌గా మొగ్గు చూపుతుంటాడు. దానివ‌ల్ల ఈ త‌రం వాళ్ల‌లో కొంత‌మందికైనా కొన్ని మంచి ప‌దాలు తెలుస్తాయంటాడీ హీరో. తాజాగా ఆయ‌న న‌టించిన చిత్రం ‘భ‌ళా తంద‌నాన‌’. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్‌, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 30న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త రిలీజ్‌ డేట్‌ను కూడా వెల్లడించారు. మే 6వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్ర యూనిట్‌. కాగా ఈ సినిమాలో  శ్రీ విష్ణు సరసన కేథరిన్‌ థ్రెసా నటించింది. ‘బాణం’ సినిమా ఫేమ్‌ చైతన్య దంతులూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. 

Videos

ఆస్ప‌త్రిలో పుట్టిన ప్రతి పసికందుకు సీఎం విజయ్ గోల్డ్ రింగ్

SBI కస్టమర్లకు షాక్.. అక్టోబర్ 1 నుంచి కొత్త విత్ డ్రా రూల్స్

మళ్లీ నేపాల్ లో భారీ ప్రళయం వైరల్ అవుతున్న వీడియో

దానం నాగేందర్ అనర్హతపై అధికారిక ప్రకటన

ది ప్యారడైజ్‌పై ట్రోల్స్ ఇక చాలు: నాని ఎమోషనల్ పోస్ట్

మ్యాచ్ ఆడకుండానే సెమిస్ కు భారత్ అసలు ఏం జరిగిందంటే?

48 గంటల్లో రాజీనామా చేయాలి.. CEC జ్ఞానేష్ కుమార్ కు CPడెడ్లైన్..

నా టార్గెట్ ఫిక్స్ అడ్డస్తే తొక్కేస్తా షాకింగ్ కామెంట్స్..!

సూర్య 50వ సినిమా ఎవరితో అంటే?

అబ్బయ్య చౌదరిపై TDP గుండాల దాడి

Photos

+5

పూలతోటలో అనుపమ పరమేశ్వరన్ చిల్.. ఫోటోలు

+5

మా మంచి మేనమామ.. సీఎం విజయ్ బంగారు కానుక (ఫొటోలు)

+5

‘ఆదర్శ కుటుంబం’ మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫొటోలు)

+5

‘అనకాపల్లి’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

60ల్లోకి ఎంటరైన పూరీ జగన్నాథ్.. బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

నయన్ కొడుకుల పుట్టినరోజు సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి ఇంట్లో ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సేవలో హీరోయిన్ మీనాక్షి (ఫొటోలు)

+5

86వ శతకం.. రికార్డులు తిరగరాసిన 'కింగ్‌' (ఫొటోలు)