Breaking News

ఉత్తమ హాస్యనటుడు.. కామారెడ్డి కిశోరుడు

Published on Sat, 05/31/2025 - 07:17

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: హాస్య నటుడిగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న వెన్నెల కిశోర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్‌ సినీ పురస్కారం–2024కి ఉత్తమ హాస్య నటుడిగా ఎంపిక చేసింది. వచ్చే నెల 14న హైదరాబాద్‌లో నిర్వహించే వేడుకలో కిశోర్‌కు పురస్కారం అందజేయనున్నారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ, యశోద దంపతులకు నలుగురు కూతుళ్లతోపాటు కుమారుడు కిశోర్‌. 

పట్టణంలోని జీవదాన్‌ హైస్కూల్‌లో పదో తరగతి వరకు చదివిన కిశోర్‌ ఇంటర్మీడియెట్‌ మాతృశ్రీ కాలేజీలో అభ్యసించారు. తరువాత హైదరాబాద్‌లో ఉన్నత చదువులకు వెళ్లారు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన వివిధ కోర్సులు అభ్యసించారు. ఇంగ్లిష్‌ పత్రికలు, ఇంగ్లిష్‌ నవలలు చదివే అలవాటున్న కిశోర్‌ ఆ భాషపై మంచి పట్టుసాధించారు. మాస్టర్స్‌ కోసం అమెరికా వెళ్లిన కిశోర్‌ చదువు పూర్తికాగానే అక్కడే ఉద్యోగంలో చేరారు. కామారెడ్డికి చెందిన స్నేహితులను కిశోర్‌ రెగ్యులర్‌గా కలుస్తుంటారు.

మరో అవార్డు..
రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ సినీ పురస్కారాలు–2024ను గురువారం ప్రకటించింది. మత్తువదలరా–2 సినిమా లో నటించిన వెన్నెల కిశోర్‌, సత్యను సంయుక్తంగా ఉత్తమ హాస్యనటులుగా ఎంపిక చేసింది. గతంలో నంది, సైమా అవార్డులను కిశోర్‌ అందుకున్నారు. తాజాగా మరో పు రస్కారం దక్కింది. కిశోర్‌ కు అవార్డు దక్కడంతో ఆయన మేనల్లు డు, లిటిల్‌ స్కాల ర్స్‌ స్కూల్‌కరస్పాండెంట్‌ పున్న రాజేశ్‌, అక్కా, బావ అరుణ, రాజేశ్వర్‌ ఆనందం వ్యక్తం చేశారు.

సినిమా పేరే ఇంటిపేరుగా..
అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో (2005) కిశోర్‌కు ఊహించకుండానే సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ‘వె న్నెల’ సినిమాలో ఆయన నటించడంతో ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మా రింది. ఆ తరువాత మూడునాలుగేళ్లపాటు సినీ అవకాశాలు లేకపోవడంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అయిన తన భార్యతో కలిసి కిశోర్‌ ఇండియాకు వచ్చేశారు. 2009లో సినీ అ వకాశాలు రావడం మొదలుకాగా, ఆ తరువాత కిశోర్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు. సుమారు 130కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. పూర్తి స్థాయి నటుడిగా సినీ రంగంలో స్థిరపడ్డారు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)