Breaking News

స్త్రీవాదాన్ని అడ్డుపెట్టుకుని ఇలా చేయడం ఘోరం: కంగనా

Published on Wed, 12/11/2024 - 18:31

భార్య వేధింపులు.. భార్య కుటుంబం బ్లాక్‌మెయిలింగ్‌.. కొడుకును కళ్లారా చూసుకోలేని దుస్థితి, న్యాయం చెప్పాల్సిన కోర్టు కూడా భార్యకే మద్దతు.. ఈ పరిస్థితుల మధ్య అతుల్‌ సుభాష్‌ నలిగిపోయాడు, కుమిలిపోయాడు. మగవారికి న్యాయం దొరకదన్న నిరాశ నిస్పృహలోకి వెళ్లిపోయాడు. ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో మరణమే శరణమని వేడుకున్నాడు. బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోషల్‌ మీడియాను కుదిపేస్తున్న ఈ విషాద ఘటనపై హీరోయిన్‌, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ స్పందించారు.

99 శాతం మగవారిదే తప్పు: కంగనా
కంగనా మాట్లాడుతూ.. యావత్‌ దేశం షాక్‌లో ఉంది. అతుల్‌ చివరి వీడియో చూస్తుంటే హృదయవిదారకంగా ఉంది. స్త్రీవాదం పేరుతో ఎంతకైనా తెగించడం హీనమైన చర్య. అతడి ఆర్థిక పరిస్థితికి మించి తన దగ్గరి నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. తీవ్ర ఒత్తిడికి వల్ల అతడు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ ఒక్క సంఘటన వల్ల మహిళలందర్నీ తప్పుపట్టలేం. ఎందుకంటే పెళ్లికి సంబంధించిన 99 కేసుల్లో మగవారిదే తప్పుంటుంది. అందుకే ఇలాంటి పొరపాటు జరిగి ఉంటుంది అని చెప్పుకొచ్చారు.

చదవండి: భర్త సుభాష్‌ బలవన్మరణం: భార్య నిఖిత రియాక్షన్‌ ఏంటంటే..

అసలేం జరిగింది?
బెంగళూరుకు చెందిన ఏఐ ఇంజనీర్‌ అతుల్‌ సుభాష్‌ భార్య నితిక సింఘానియా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి ముందు 24 పేజీల సూసైడ్‌ నోట్‌తో పాటు ఓ సెల్ఫీ వీడియో చిత్రీకరించాడు. తప్పుడు కేసుల వల్ల ఎంతోమంది భర్తలు చనిపోతున్నారని, ఈ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని తన డెత్‌ నోట్‌లో పేర్కొన్నాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)