Breaking News

Banita Sandhu: ‘గూఢచారి’తో యాక్షన్‌కి సిద్ధమైన బనితా సంధు!

Published on Sat, 03/30/2024 - 11:19

‘అక్టోబర్, సర్దార్‌ ఉదమ్‌’ వంటి హిందీ చిత్రాలతో, తమిళ చిత్రం ‘ఆదిత్య వర్మ’తో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బనితా సంధు. ఈ బ్యూటీ ‘జీ 2’ (గూఢచారి 2) చిత్రంతో పాన్‌ ఇండియా ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. అడివి శేష్‌ హీరోగా రూపొందిన సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ (2018) ‘గూఢచారి’కి సీక్వెల్‌గా పాన్‌ ఇండియా స్థాయిలో ‘జీ 2’ తెరకెక్కుతోంది. గూఢచారిగా హీరో అడివి శేష్‌ నటిస్తున్నారు. ఈ స్పై సరసన బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తున్నారు. వినయ్‌ కుమార్‌ సిరిగినీడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ గుజరాత్‌లోని భుజ్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో బనితా జాయిన్‌ అయిన విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘శేష్, బనితాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. తెరపై ఇద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. హై ఆక్టేన్‌ యాక్షన్‌ మూవీగా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఈ సినిమాని రూపొందిస్తున్నాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ‘‘ఈ చిత్రంలో నటించడం క్రియేటివ్‌గా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటివరకూ చేయని పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నాను’’ అని బనితా సంధు అన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ కీలక పాత్ర చేస్తున్నారు.  

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)