amp pages | Sakshi

బంగార్రాజు మూవీ రివ్యూ

Published on Fri, 01/14/2022 - 12:42

టైటిల్‌ : బంగార్రాజు
నటీనటులు : నాగార్జున, నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, నాగబాబు రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, సంపత్‌ రాజ్‌, గోవింద్‌ పద్మసూర్య తదితరులు
నిర్మాణ సంస్థలు :  అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ 
నిర్మాత : అక్కినేని నాగార్జున
దర్శకత్వం : కల్యాణ్‌ కృష్ణ కురసాల
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : జె. యువరాజ్‌
ఎడిటర్‌ : విజయ్‌ వర్థన్‌
విడుదల తేది : జనవరి 14, 2022

Bangarraju Movie Review: అక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్ లో చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’చిత్రం 2016 సంక్రాంతి సీజన్‌లో విడుదలై సూపర్‌ హిట్టైంది. ఏకంగా కింగ్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలిచింది. ఆ మూవీ భారీ విజయం సాధించడంతో అందులోని బంగార్రాజు పాత్రతో కథని అల్లుకొని ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ సినిమా తెరకెక్కింది. ‘మనం’ తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం శుక్రవారం(జనవరి 14)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కి మంచి స్పందన రావడం.. దానికి తోడు ప్రమోషన్స్‌ని గ్రాండ్‌ చేయడంలో ‘బంగార్రాజు’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ఈ సంక్రాంతి బరిలోకి దిగిన ఏకైన పెద్ద సినిమా  ‘బంగార్రాజు’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించాడు? రివ్యూలో చూద్దాం. 

 ‘బంగార్రాజు’కథేంటంటే
‘సోగ్గాడే చిన్ని నాయన’చిత్రం ఎక్కడ ముగిసిందో.. అక్కడి నుంచి ‘బంగార్రాజు’కథ స్టార్ట్‌ అవుతుంది. ఆత్మగా వచ్చిన బంగార్రాజు(నాగార్జున)..తన ఫ్యామిలీ సమస్యలన్నీ చక్కదిద్ది స్వర్గానికి తిరిగి వెళ్తాడు. కొన్నాళ్లకు డాక్టర్‌ రాము(నాగార్జున), సీత దంపతులకు కొడుకు పుట్టడం..భార్య చిన్నప్పుడే చనిపోవడంతో..అతని బాధ్యలను నాన్నమ్మ సత్య అలియాస్‌ సత్తెమ్మ(రమ్యకృష్ణ) చూసుకుంటుంది. మనవడు పెద్దయ్యేసరికి.. సత్తెమ్మ కూడా చనిపోయి..స్వర్గంలో ఉన్న బంగార్రాజు దగ్గరకు వెళ్లుంది. చిన్నబంగార్రాజు(నాగచైతన్య) కూడా తాత మాదిరే ఊర్లో ఆవారాగా తిరుతూ..  అమ్మాయిల వెంటపడుతుంటాడు. మరోపక్క చిన్న బంగార్రాజు మరదలు.. నాగలక్ష్మీ(కృతిశెట్టి) ఆ ఊరికి సర్పంచ్‌ అవుతుంది. వీరిద్దరికి ఒకరంటే ఒకరుపడరు. కానీ వీరిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటందని భావిస్తుంది సత్తెమ్మ. తన మనవడి ప్రేమకి సహాయం చేయడానికి బంగార్రాజుని భూమ్మీదకి పంపిస్తుంది. చిన్న బంగార్రాజు శరీరంలోకి పెద్ద బంగార్రాజు చేరి.. సర్పంచ్‌ నాగలక్ష్మీని ప్రేమించేలా చేస్తాడు. మరోవైపు చిన్న బంగార్రాజు హత్య చేయడానికి కొంతమంది ప్లాన్‌ చేస్తారు. అసలు చిన్న బంగార్రాజుని ఎందుకు హత్య చేయాలనుకున్నారు? హత్యకు కుట్ర చేసిందెవరు? ఆపదలో ఉన్న మనవడిని బంగార్రాజు ఎలా కాపాడుకున్నాడు? ఊరి గుడి కింద ఉన్న నిధులపై కన్నేసిన దుష్టశక్తుల పన్నాగాలను బంగార్రాజు ఎలా తిప్పికొట్టారు? అనేదే మిగతా కథ. 


ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమాకు ప్రధాన బలం నాగార్జున, నాగచైతన్యల నటననే. చిన్నబంగార్రాజు, పెద్ద బంగార్రాజు పాత్రల్లో వీరిద్దరు ఒదిగిపోయారు. సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాయి. బంగార్రాజు ఆత్మ దూరిన ప్రతిసారి నాగచైనత్య చేసే సందడి ఆకట్టుకుంటుంది. అయితే సాధారణ సమయంలో చిన్నబంగార్రాజు కామ్‌గా ఉండడం.. ఆత్మ దూరిన తర్వాత రెచ్చిపోవడంతో.. చై కంటే నాగార్జుననే హైలెట్‌ అయ్యాడని చెప్పాలి. క్లైమాక్స్‌లో వీరిద్దకు కలిసే చేసే ఫైట్‌ సీన్‌ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సర్పంచ్‌ నాగలక్ష్మీగా కృతిశెట్టి తనదైన నటనతో మెప్పించింది. అమాయకపు మాటలతో నవ్వించింది. బంగార్రాజు భార‍్య సత్య అలియాస్‌ సత్తెమ్మగా రమ్యకృష్ణ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించింది. సంపత్‌ రాజ్‌, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఎలా ఉందంటే.. 
2016లో సంకాంత్రికి విడుదలైన‘సోగ్గాడే చిన్ని నాయనా’ఎంతటి ఘటన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌ అనగానే ‘బంగర్రాజు’కథ ఎలా ఉండబోతుందో అంతా ఊహించుకున్నారు. అనుకున్నట్లుగానే.. పల్లెటూరి వాతావరణం, కలర్‌ఫుల్‌ సాంగ్స్‌తో ఫన్‌ అండ్‌ ఎమోషనల్‌గా ‘బంగార్రాజు’కథ సాగుతుంది. సోగ్గాడే.. సినిమా మాదిరినే.. ఈ చిత్రానికి కూడా గుడికి, బంగార్రాజు కుటుంబానికి ముడిపెట్టి కథను అల్లుకున్నాడు దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ. అందులో కొడుకు,కోడళ్లను కలిపేందుకు బంగ్రారాజు ఆత్మ భూమ్మీదకు వస్తే.. ఇందులో మనవడిని జీవితాన్ని చక్కబెట్టేందుకు కిందకు వస్తాడు. ఇక ఈ సీక్వెల్‌లో సత్తెమ్మ ఆత్మ అదనం. అయితే సోగ్గాడే.. ఆకట్టుకున్నంతగా.. బంగార్రాజు ఆకట్టుకోలేకపోయాడు.

ఫస్టాఫ్‌ అంతా రోటీన్‌ సీన్లతో నెమ్మదిగా సాగుతుంది. బంగార్రాజు, సత్యల ఆత్మలు భూమ్మీదకు వచ్చాక కథలో వేగం పెరుగుతుంది. అయినప్పటికీ.. సాదాసీదాగానే సాగిపోతుంది. సర్పంచ్‌ నాగలక్ష్మీ, చిన్నబంగార్రాజుల మధ్య జరిగే టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ అంతగా ఆకట్టుకోలేకపోయింది. పెద్ద బంగార్రాజు చేసే సందడి మాత్రం ప్రేక్షకులను నవ్విస్తుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథ ప్రేక్షకుడి ఊహకి అందేలా సాగుతుంది. కామెడీ కూడా అంతగా వర్కౌట్‌ కాలేదనే చెప్పాలి. ‘వీరి వీరి గుమ్మడి పండు’గేమ్‌ సీన్‌ అలరిస్తుంది. ఇక సినిమాను ప్రధాన బలం ప్రీక్లైమాక్స్‌, క్లైమాక్స్‌ అనే చెప్పాలి. చివరి 30 నిమిషాలు సినిమాపై అభిప్రాయాన్ని మారుస్తుంది. క్లైమాక్స్‌ ట్విస్ట్‌ కూడా ఆకట్టుకుంటుంది. ఇక సాంకెతిక నిపుణుల పనితీరు విషయానికొస్తే.. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సినిమాకి ప్లస్‌. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చక్కగా అందించాడు. అయితే సినిమాల్లో వచ్చే పాటలు.. కథకు అడ్డంకిగా అనిపిస్తాయి. యువరాజ్‌ సినిమాటోగ్రఫీ బాగుంది. విజయ్‌ వర్థన్‌ తన కత్తెర ఇంకాస్త పనిచెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)