నా ఇల్లే ముట్టడిస్తారా.. దమ్మున్నోళ్లు రెండిరా..?! భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్
Breaking News
ఇప్పుడా సినిమా తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి
Published on Sun, 05/24/2026 - 16:39
పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తీస్తున్న 'డ్రాగన్' మూవీతో బిజీగా ఉన్నాడు. కొన్నిరోజుల క్రితం గ్లింప్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే తారక్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ లాంటి మూవీ అంటే అందరూ చెప్పేది 'టెంపర్' గురించే. ఇప్పుడా చిత్రం గురించి నిర్మాత బండ్ల గణేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాజాగా నటుడు రాజా రవీంద్రతో చేసిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
(ఇదీ చదవండి: లావుగా ఉన్నా.. జనాలు చూస్తారా అని తారక్ అడిగాడు)
'ఎన్టీఆర్ కెరీర్‌లో రెండు సూపర్ హిట్స్ ఇచ్చాను. 'బాద్‌షా' ముందు ఆయనకు ఫ్లాపులు ఉన్నాయి. ఆ రోజుకి ఎన్టీఆర్ కెరీర్ 'బాద్‌షా' బిగ్గెస్ట్ హిట్. దాని తర్వాత 'రామయ్య వస్తావయ్యా' అనే డిజాస్టర్ చేశారు హరీశ్ శంకర్‌తో. తర్వాత 'రభస' అనే అట్టర్‌ఫ్లాప్ తీశారు. తర్వాత 'టెంపర్' అనే బ్లాక్‌బస్టర్ తీశాను. ఈ కథ వక్కంతం వంశీ చెప్పగానే.. ఇది పెద్ద హిట్టవుద్దిరా వంశీ అని చెప్పి.. నేను దాన్ని పూరీ దగ్గరకు తీసుకెళ్లా. పూరీ స్టోరీ వినగానే ఇది నీకు మరో 'గబ్బర్‌సింగ్' అని అన్నాడు. ఆ సినిమా ఇప్పుడు గనక తీస్తే రూ.1000 కోట్లు వస్తాయి. హీరో కూడా ఫెర్ఫార్మెన్స్ చింపి చాటేశాడు' అని బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు.
2015లో రిలీజైన 'టెంపర్' ముందు వరకు ఎన్టీఆర్ కెరీర్ అంతంత మాత్రంగానే ఉండేది. ఒక సినిమా అయితే వరసగా ఫ్లాప్లులు ఎదురయ్యేవి. 'టెంపర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ మాట్లాడుతూ.. ఇకపై అభిమానులు కాలర్ ఎత్తుకునేలాంటి మూవీస్ చేస్తానని అన్నాడు. అందుకు తగ్గట్లే మాట మీద నిలబడుతూ వచ్చాడు. కానీ ఈ సెంటిమెంట్‌ని గతేడాది రిలీజైన 'వార్ 2' దారుణంగా బ్రేక్ చేసింది. ఘోరాతీ ఘోరంగా ఫ్లాప్ అయింది. సాధారణంగా పూరీ జగన్నాథ్ తాను తీసే సినిమాల్లో వేరొకరి స్టోరీ ఉపయోగించుకోడు. కానీ 'టెంపర్' కోసం ఆ సెంటిమెంట్ పక్కనబెట్టాడు. అటు పూరీ, ఇటు ఎన్టీఆర్.. ఇద్దరూ ఈ మూవీతో అదిరిపోయే సక్సెస్ కొట్టారు.
(ఇదీ చదవండి: ఇలాంటి టాక్‌తో 'దృశ్యం 3'కి రూ.100 కోట్ల కలెక్షన్ ఎలా సాధ్యం?)
Temper cinema ippudu teesthe 1000 kotlu Chestundi
– Producer Bandla Ganesh pic.twitter.com/iNvrla8Nev— cinee worldd (@Cinee_Worldd) May 24, 2026
Tags : 1