Breaking News

పేరు పెట్టకుండా బండ్ల గణేశ్‌ ట్వీట్‌.. ఆయన మీదేనా?

Published on Thu, 10/16/2025 - 17:39

టాలీవుడ్నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh)కు సోషల్మీడియాలో ఉన్న ఫాలోయింగ్గురించి తెలిసిందే. ఆయన ట్వీట్చేసినా.. క్షణాల్లో వైరల్అవుతుంటాయి. సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలపైన తనదైన శైలీలో స్పందిస్తుంటారు. కొన్ని విషయాలపై డైరెక్ట్గా, మరికొన్ని విషయాలపై పరోక్షంగా ఆయన కామెంట్స్చేస్తుంటారు. తాజాగా ఆయన ఎక్స్లో పెట్టిన ఒక పోస్టు ఇప్పుడు టాలీవుడ్లో తీవ్ర చర్చకు దారితీసింది. గురువారం మధ్యాహ్నం ఆయన తన ఎక్స్ఖాతాలోఅది పీకుతా ఇది పీకుతా అని మనం చెప్పాల్సిన పని లేదు… మాటలు మన చేతిలో ఉన్నా, ఆట ఎవరిదో జనాలు తీర్మానిస్తారు……! అంటూ రాసుకొచ్చాడు. పేరునూ ప్రస్తావించకుండా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి ఉంటాయా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

ఆ నిర్మాతకు కౌంటర్‌గానేనా?
ఇటీవల టాలీవుడ్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ముందు కొంతమంది దర్శకనిర్మాతలు, హీరోలు ఇచ్చే స్టేట్మెంట్స్చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా మిత్రమండలి సినిమా ప్రీరిలీజ్ఈవెంట్లో నిర్మాత బన్నివాసు(Bunny Vasu) చాలా ఎమోషనల్గా మాట్లాడారు. తమ సినిమాను కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తొక్కేయాలని చూస్తున్నారని.. కానీ జనాలు సినిమా బాగుంటేనే చూస్తారని, లేకపోతే చూడరని... డబ్బు పెట్టి ఓ సినిమాను ట్రోల్ చేస్తే అది నడవదని అన్నారు. అంతటితో ఆగకుండా..తొక్కితే బన్నీ వాసు పడిపోతాడని అనుకోవద్దని.. నా వెంట్రుక కూడా పీకలేరంటూ ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. రోజు సినిమా రిలీజై మిక్స్డ్టాక్ని సంపాదించుకుంది

ఇదే రోజు బండ్ల గణేశ్పైవిధంగా ట్వీట్చేయడంతో .. బన్నీవాసుకి కౌంటర్గానే ఇలా పోస్ట్పెట్టాడని నెటిజన్స్అభిప్రాయపడుతున్నారు. ఆయన పోస్ట్కింద చాలామంది ఇది బన్నీవాసు గురించే అని కామెంట్స్చేస్తున్నారు. బండ్ల గణేశ్‌ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని, ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఈ మాటలు అన్నారని తెలియదు కానీ.. బన్నీవాసు పేరు అయితే బాగా ట్రోల్అవుతుంది.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)