Breaking News

కానిస్టేబుల్ పరీక్షలో 'బలగం' సినిమాపై ప్రశ్న.. అదేంటంటే?

Published on Sun, 04/30/2023 - 21:58

తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన చిత్రం 'బలగం'. కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రికార్డులు కొల్లగొట్టింది. ఎప్పుడు తెరపై కనిపించని వారు కూడా ఈ సినిమాలో ఫేమస్ అయిపోయారు. అంతలా ప్రజల ఆదరాభిమానులు సంపాదించుకున్న ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు వరించిన సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: ' 'బలగం' తొలి సినిమానే.. కానీ ఆమె జీవితమే ఓ కన్నీటి కథ')

అయితే తాజాగా ఈ సినిమాపై తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షలో ఓ ప్రశ్న వచ్చిందంటే బలగం సినిమాకు ఉన్న ఆదరణ ఏంటో అర్థమవుతోంది. ఈనెల 30న జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రశ్నను అడిగారు. మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఓ విభాగంలో బలగం సినిమాకు పురస్కారం లభించింది అన్న ప్రశ్న అడిగారు. అబ్జెక్టివ్‌ టైప్ ప్రశ్నకు ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఉత్తమ నాటకం అనేది సరైన సమాధానం. ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఉత్తమ నాటకం విభాగంలో అవార్డ్ దక్కింది.  కాగా.. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, వేణు యెల్దండి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికీ పల్లెల్లో ఈ సినిమాను పెద్ద తెరలపై ప్రదర్శిస్తున్నారు. 

(ఇది చదవండి: తోడుగా ఉన్న భర్త చనిపోయాడు, చేతికందిన కొడుకు కూడా: బలగం నటి)

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి