Breaking News

ఆ సార్లకు తలవంచి ధన్యవాదాలు చెబుతున్నా: బలగం మొగిలయ్య

Published on Thu, 04/13/2023 - 08:28

హైదరాబాద్: నిమ్స్‌లో ‘బలగం’ మొగిలయ్యకు చికిత్స కొనసాగుతుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశాల మేరకు వైద్యనిపుణులు నిత్య పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. ఛాతి నొప్పి రావడంతో మెరుగైన చికత్స నిమిత్తం వరంగల్‌ నుంచి నిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. 

ఆయన దీర్ఘకాలంగా డయాబెటిక్, బీపీ సమస్యలతో బాధ పడుతున్నాడు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఏడాది నుంచి డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుంచి మొగిలయ్య కంటి చూపునూ కోల్పోయారు. ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను గురువారం నిమ్స్‌ పాత భవనంలోని ఎఫ్‌ బ్లాక్‌ స్పెషల్‌ రూమ్‌కు తరలించి డయాలసిస్‌ సేవలను అందిస్తున్నారు. ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆహారం కూడా తీసుకుంటున్నారని నిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నగరి బీరప్ప తెలిపారు. తన పనులు తాను చేసుకోలేని పరిస్థితుల్లో మొగిలయ్య ఉన్నాడని ఆయన భార్య కొమురమ్మ కన్నీటి పర్యంతమైంది. 

అయనకు మెరుగైన వైద్యం అందించడానికి సాయపడుతున్న మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఆయా సార్ల సాయంతో నిమ్స్‌కు వచ్చిన మొగిలయ్య ఆరోగ్యం గురించి మరెంతో మంది పెద్ద సార్లు ఆందోళన చెందుతున్నారని.. ఇప్పటికీ అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్‌ఎస్‌ నాయకులు, నిర్మాత దిల్‌ రాజు, బలగం దర్శకులు వేణు ఇంకా ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారని చెప్పారు.  

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)