Breaking News

' 'బలగం' తొలి సినిమానే.. కానీ ఆమె జీవితమే ఓ కన్నీటి కథ'

Published on Fri, 04/14/2023 - 21:30

తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన చిత్రం 'బలగం'. మానవ సంబంధాలను, ముఖ్యంగా రక్తబంధాన్ని హృదయాలను హత్తుకునేలా చూపించారు. ఈ సినిమా కన్నీళ్లు పెట్టనివారు లేదంటే ఏ రేంజ్‌లో హిట్‌ అయిందో అర్థమవుతోంది. అయితే ఈ సినిమాలో నటించిన వారిలో ప్రతి ఒక్కరీ జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నవారే. అలాంటివారిలో కీలక పాత్రధారిగా బలగం సినిమాలో మెప్పించిన కొమరయ్య చెల్లెలు పోచవ్వ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంపై ఆసక్తికర  విషయాలను పంచుకున్నారు. 
  

ఆమె అసలు పేరు విజయలక్ష్మి. బలగం చిత్రంలో పోచవ్వ పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. ఆమె సురభి కళాకారిణి కాగా.. ఈ సినిమాలో పోచవ్వ నటనకు ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. కొమరయ్యకు చెల్లెలుగా.. ఆ కుటుంబానికి మేనత్తగా మెప్పించింది. 

విజయలక్ష్మి మాట్లాడుతూ.. ' తాను సురభి కళాకారిణిని. 35 ఏళ్ల పాటు నాటకాలు వేశా, హరికథలు చెప్పా. నంది అవార్డు వచ్చింది. నేను చేసిన తొలి చిత్రం బలగం. నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం దర్శకుడు వేణునే. ఆర్థికంగా చాలా కష్టాలు పడ్డా. నా భర్త చనిపోయాక పిల్లలకు పెళ్లిళ్లు చేశా. ఇద్దరు కుమారులు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. నా చిన్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ సమయంలో నా కోడలు గర్భవతి. నా జీవితంలో అంతుచిక్కని విషాదం. భర్త చనిపోవడం, నాలుగేళ్లకే కుమారుడిని పోగొట్టుకుని తీవ్ర విషాదంలో మునిగిపోయా. ఆ సంఘటన నుంచి ఇప్పటికీ బయట పడలేకపోతున్నా.' అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె నటించిన తొలి సినిమా అయినా తనదైన నటనతో ఆకట్టుకున్నారు. 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)