Breaking News

పెళ్లి కాని వాళ్లకు నన్ను చూస్తేనే అసూయ: నటుడు

Published on Mon, 10/28/2024 - 18:33

సమాజంలో పెళ్లికాని ప్రసాదులూ ఉన్నారు.. ముచ్చటగా మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లూ ఉన్నారు. ఈ మధ్యే మలయాళ నటుడు బాల (బాలకుమార్‌) సైతం నాలుగో వివాహం చేసుకున్నాడు. చుట్టాలమ్మాయి కోకిల మెడలో మూడు ముళ్లు వేశాడు. వీరిద్దరికీ దాదాపు 18 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది. అయితే చాలామంది తనను చూసి కుళ్లుకుంటున్నారంటున్నాడు బాల.

 రాజులా బతుకుతున్నా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నటుడు బాల మాట్లాడుతూ.. 'ఇప్పుడు నా వయసు 42 ఏళ్లు, కోకిలకు 24 ఏళ్లు. అయినా మా సంసార జీవితం సంతోషంగా సాగుతోంది. నేను రాజులా బతుకుతున్నా.. భార్యను రాణిలా చూసుకుంటున్నా.. త్వరలోనే మాకు ఓ బుజ్జి బాబు/పాపాయి రానుంది. ఇదంతా చూసి మీరు అసూయ చెందితే దానికి నేనేం చేయలేను. 

తప్పులు వెతకడమే మీ పని
మీ దగ్గర డబ్బు లేకనే ఏ అమ్మాయి దొరకడం లేదు. అయినా నా నాలుగు పెళ్లిళ్లపై ఏడుస్తారేమో! ప్రతిదాంట్లో తప్పులు వెతకడమే మీలాంటివారి పని' అని కౌంటరిచ్చాడు. కోకిల మాట్లాడుతూ.. చాలాకాలంగా మామ ఒంటరిగానే ఉంటున్నాడు. ఇప్పుడు నేను అతడికి తోడుగా ఉన్నాను. చిన్నప్పటినుంచి అతడు అందరికీ సాయం చేస్తూ ఉంటాడు. అది చూసే నేను ప్రేమలో పడ్డాను అని చెప్పుకొచ్చింది.

పెళ్లి హిస్టరీ..
ఇకపోతే బాల.. కంగువ మూవీ డైరెక్టర్‌ శివకు తమ్ముడవుతాడు. కాగా బాల 2008లో చందన సదాశివ అనే అమ్మాయిని పెళ్లాడాడు. ఏడాదికే ఆమెకు విడాకులిచ్చేసి 2010లో మలయాళ సింగర్‌ అమృతా సురేశ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా పుట్టింది. తర్వాత పొరపచ్చాలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. 2021లో డాక్టర్‌ ఎలిజబెత్‌ ఉదయన్‌ను పెళ్లాడగా ఆమెతోనూ సుదీర్ఘ ప్రయాణం చేయలేదు. పోయిన ఏడాదే విడిపోయాడు. ఈ మధ్యే కోకిలను నాలుగో పెళ్లి చేసుకున్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)